Asianet News TeluguAsianet News Telugu

వచ్చే పదేళ్లలో గ్రీన్ హైడ్రోజన్ ధరను భారీగా తగ్గించడానికి రిలయన్స్ కృషి చేస్తుంది: ముకేష్ అంబానీ

భారతదేశం  450 GW పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 100 GWని సృష్టిస్తుందని ముకేశ్ అంబానీ అన్నారు. ఇందుకు రిలయన్స్ కంపెనీ ఈ లక్ష్యానికి పూర్తిగా కట్టుబడి ఉందని  ఇంటెర్నేషనల్ క్లైమెట్ సమ్మిట్ 2021లో చెప్పారు.

Reliance will work on bringing down the cost of Green Hydrogen to $1/kg in the next decade.
Author
Hyderabad, First Published Sep 3, 2021, 8:44 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐ‌ఎల్) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం మాట్లాడుతూ భారతదేశం ఇప్పటికే 100 శాతం  ఎనర్జి ఇండిపెండెంట్ గా మారాలనే కలను సాకారం చేసుకునే మార్గంలో ఉందని, శిలాజ ఇంధనాల స్థానంలో క్లీనర్ ఎనర్జీ సొల్యూషన్స్‌ని కూడా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.

ముకేష్ అంబానీ సంస్థ ఈ లక్ష్యానికి పూర్తిగా కట్టుబడి ఉందని, 2030 నాటికి భారతదేశంలో 450gw పునరుత్పాదక లక్ష్యంగా కనీసం 100gwని సృష్టించగలదని నేడు ఇంటెర్నేషనల్ క్లైమెట్ సమ్మిట్ 2021లో ఆయన ప్రసంగించారు. 

 గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, పర్యావరణ, అటవీ అండ్ వాతావరణ మార్పు మంత్రి శ్రీ. భూపేందర్ యాదవ్ జీ, పవర్ అండ్ న్యూ  & రినివబుల్ ఎనర్జీ మంత్రి శ్రీ రాజ్ కుమార్ సింగ్ జీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ జీ, మెంబర్ ఎనర్జీ నీతి ఆయోగ్ డాక్టర్ వికె సరస్వత్, మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, మిస్టర్ నోబువో తనకా చైర్మన్ గ్రీన్‌స్టాట్ ఇండియా మిస్టర్ స్టర్లే ​​పెడెర్సెన్, ఇతర ప్రముఖులు, మహిళలు, పెద్దవారికి మీ అందరికీ శుభోదయం.


ఇంటెర్నేషనల్ క్లైమెట్ సమ్మిట్  - 2021లో ప్రేక్షకుల ముందు ప్రసంగం చేయడం గౌరవంగా ఉంది. వాతావరణ మార్పు ఇంకా స్వచ్ఛమైన శక్తి గురించి చర్చించడానికి ఈ సమావేశంలో ప్రముఖ పాలసీ మేకర్స్, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలను ఒకచోట చేరడం చూసి నేను సంతోషంగా ఉన్నాను. ఆగస్టు 15న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ చారిత్రాత్మక ప్రకటన నేపథ్యంలో ఈ  సమావేశం జరుగుతోంది.

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను ప్రారంభించారు .ఈ ప్రకటన చేయడానికి అతను  ఎంచుకున్న " ఆజాది కా అమృత్ మహోత్సవ్ " అనే ఫ్యాక్ట్ భారతీయులకు అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలకుపవర్ ఫుల్ మెసేజ్ పంపింది. నా దృష్టిలో  ఈ మెసేజ్ లో రెండు విషయాలు  ఉన్నాయి ఒకటి-శిలాజ శక్తిపై ఆధారపడటం నుండి అజాదిని సాధించాలని  ఇంకా కొత్త అండ్ రినివల్ శక్తిలో ఆత్మ-నిర్భర్‌గా మారాలని భారతదేశం నిశ్చయించుకుంది . రెండు-క్లైమేట్ యాక్షన్ టార్గెట్ అండ్ గోల్స్ సాధించడానికి ప్రపంచ ప్రయత్నాలకు భారతదేశం పూర్తి సహకారం అందిస్తుంది.


ప్రియమైన మిత్రులారా, వాతావరణ మార్పు అనేది నిస్సందేహంగా నేడు మానవ నాగరికత ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సవాలు. గ్లోబల్ వార్మింగ్  ప్రభావాలను ప్రపంచం ఆందోళనకరమైనదిగా చూస్తోంది. గ్లెసియర్స్ తగ్గుతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతోంది. విపరీతమైన, అనూహ్యమైన  వాతావరణ మార్పులు సాధారణం అవుతున్నాయి. పర్యావరణ నష్టం తీవ్రంగా మారుతోంది. నిజానికి వాతావరణ మార్పు అనియంత్రితంగా ఉంటే మన గ్రహం మీద జీవ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల మన ఆర్థిక వ్యవస్థలను కార్బన్ న్యూట్రల్ గా ఉంచడానికి ఇది సరిపోదు.

ప్రపంచం వీలైనంత త్వరగా ఉద్గారాల తగ్గింపులను సాధించాలి. మనకు ఒకే ఒక ఆప్షన్ ఉంది: గ్రీన్, క్లీన్ అండ్ రినివబుల్ ఎనర్జీ కొత్త శకానికి వేగంగా మారడం. వాతావరణ మార్పు అనేది ప్రపంచ సమస్య కాబట్టి క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ టెక్నాలజి అభివృద్ధి, పెట్టుబడులు, మార్కెట్ యాక్సెస్‌లో సాధ్యమైనంత విస్తృతమైన ప్రపంచ సహకారం కోసం పిలుపునిస్తుంది.

లేడీస్ అండ్ జెంటిల్మెంట్ 

ఈ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ప్రపంచానికి అత్యవసరం అయినప్పటికీ, భారతదేశానికి ఇది ముఖ్యం. మన ప్రస్తుత ఇంధన డిమాండ్‌లో ఎక్కువ భాగం ప్రతి సంవత్సరం 160 బిలియన్ డాలర్ల వ్యయంతో దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాల ద్వారా తీర్చబడుతుంది. భారతదేశ తలసరి ఇంధన వినియోగం, ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే సగం కంటే తక్కువగా ఉన్నప్పటికీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదల చేయడంలో మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నాము. 1.38 బిలియన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మన ఆర్థిక వృద్ధి వేగవంతం కావడంతో భారతదేశ ఇంధన అవసరాలు విపరీతంగా పెరుగుతాయి.

కార్బన్ ఉద్గారలను గణనీయంగా తగ్గించేటప్పుడు మన శక్తి ఉత్పత్తిని ఎలా పెంచుకోవాలి?

భారతదేశం అలాగే ప్రపంచం రెండూ అపూర్వమైన సవాలును ఎదుర్కొంటున్నాయి.మానవ చరిత్రలో ప్రతి సవాలు తదుపరి స్థాయి పురోగతికి వెళ్ళే అవకాశంతో వచ్చింది.

ప్రియమైన మిత్రులారా,

21వ శతాబ్దంలో మానవ నాగరికత పునరుద్ధరించుకోవడానికి వాతావరణ మార్పు ఒక అవకాశం అని నేను నమ్ముతున్నాను ...మానవ జాతికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, మరింత సురక్షితమైన భవిష్యత్తును సృష్టించే అవకాశం ...భవిష్యత్తులో మనిషి, ప్రకృతి మధ్య ఎక్కువ సామరస్యం ఉంటుంది. నాగరిక పునరుద్ధరణకు ఈ అవకాశం కొత్త, పునరుత్పాదక శక్తి ద్వారా గ్రహించబడుతుంది. పాత శక్తి వాతావరణ మార్పు సమస్యను సృష్టించినట్లయితే, కొత్త శక్తి వాతావరణ ఉపశమనానికి విశ్వసనీయమైన పరిష్కారాన్ని అందిస్తుంది.

భారతదేశంలో ఒక కొత్త గ్రీన్ రివొల్యూషన్ ఇప్పటికే ప్రారంభమైంది. పాత గ్రీన్ రివొల్యూషన్ భారతదేశాన్ని ఆహార ఉత్పత్తిలో సెల్ఫ్ రిలయంట్ చేసింది. కొత్త గ్రీన్ రివొల్యూషన్ భారతదేశాన్ని శక్తి ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చేందుకు సహాయపడుతుంది. భారతదేశం ఇప్పుడు 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వ్యవస్థాపనలో ఒక ప్రధాన మైలురాయిని సాధించడం మనందరికీ గర్వకారణం.

పునరుత్పాదక శక్తి కోసం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో భారతదేశం నేడు మొదటి మూడు స్థానాల్లో ఉంది. డిసెంబర్ 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం లక్ష్యం ఇప్పుడు కనుచూపు మేరలో ఉంది. మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నాయకత్వంలో భారతదేశం సాధించిన ఏకైక విజయాన్ని ప్రపంచం మొత్తం ప్రశంసిస్తుంది.


ప్రియమైన మిత్రులారా,

రాబోయే సంవత్సరాల్లో గ్రీన్ ఎనర్జీ రివల్యూషన్‌లో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎలా మారాలనే దానిపై నా దృక్పథాలను మీతో పంచుకోవడానికి నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. భారత ఉపఖండం నిజంగా సూర్యదేవుడు, వాయుదేవుడు ఇతర దేవతలచే విస్తారమైన పునరుత్పాదక ఇంధన వనరులతో ఆశీర్వదించబడింది. సంవత్సరంలో 300 కంటే ఎక్కువ ఎండ రోజులను సద్వినియోగం చేసుకుంటే, భారతదేశంలో కేవలం 0.5% భూమిలో 1,000 GW సౌరశక్తిని సులభంగా ఉత్పత్తి చేయవచ్చు. డిసెంట్రలైజేడ్ ఎనర్జీ ప్రొడక్షన్ కి సోలార్ ఖచ్చితంగా సరిపోతుంది, ఇది డిసెంట్రలైజేడ్  సోసియో-ఎకనామిక్  అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

స్మార్ట్, టూ-వే గ్రిడ్‌లు, మైక్రో-గ్రిడ్‌లు, స్టోరేజ్ సొల్యూషన్స్, స్మార్ట్ మీటర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనము ప్రతి ఒక్కరూ, కమ్యూనిటీలు, పొరుగు ప్రాంతాల వారు శక్తి ఉత్పత్తిదారులుగా మారవచ్చు. ఈ ఇన్‌స్టాలేషన్‌లు డిమాండ్‌కు దగ్గరగా ఉంటాయి. ఇంకా తక్కువ నిర్వహణ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.  మానవ సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. ఉత్పాదక వ్యయం వేగంగా పడిపోవడం సౌరశక్తిని అత్యంత పోటీతత్వంతో చేసింది, పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది.

"గ్రీన్ హైడ్రోజన్" లో ఇలాంటి వృద్ధి ధోరణులను నిర్ధారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా భవిష్యత్తులో శిలాజ ఇంధనాలను భర్తీ చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ జీరో కార్బన్ ఎనర్జీ . అత్యుత్తమ, పరిశుభ్రమైన శక్తి వనరు, ఇంకా గ్లోబల్ డీకార్బనైజేషన్ ప్రణాళికలలో ప్రాథమిక పాత్రను పోషిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ అనేది గ్రహం మీద ఉన్న ప్రతిఒక్కరి భవిష్యత్తుకు కీలకం. హైడ్రోజన్ అధిక గ్రావిమెట్రిక్ ఎనర్జీ  డెన్సిటీ కలిగి ఉంటుంది ఇంకా సున్నా ఉద్గారాలతో విద్యుత్, వేడిగా మార్చబడుతుంది.

ఈ రోజు ఎలెక్ట్రోలిసిస్ నుండి హైడ్రోజన్ ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో అవి గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. హైడ్రోజన్ స్టోరేజ్ ఇంకా  రవాణా కోసం కొత్త టెక్నాలజి అభివృద్ధి చెందుతున్నాయి, ఇది పంపిణీ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇంకా, భారత ప్రభుత్వం దేశంలో గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ప్రణాళిక చేస్తోంది. ఈ పరిణామాల కారణంగా గ్రీన్ హైడ్రోజన్ తప్పనిసరిగా గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుంది.


ప్రియమైన మిత్రులారా,

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వచ్ఛమైన శక్తిని ఉపయోగించి భారతదేశ గ్రీన్ ఎకానమీకి ఆజ్యం పోసేలా మన ప్రధాన మంత్రి దృష్టిని సాకారం చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉంది.గత సంవత్సరం నేను రిలయన్స్ ని నెట్ కార్బన్ జీరో కంపెనీగా 2035 నాటికి మార్చాలనే మా ప్రతిష్టాత్మక నిబద్ధతను ప్రకటించాను. ఈ సంవత్సరం, నేను న్యూ ఎనర్జీ బిజినెస్ కోసం మా వ్యూహం, రోడ్‌మ్యాప్‌ని అందించాను, ఇది రిలయన్స్ ఇంకా ఇండియా కోసం నెక్స్ట్ బిగ్ వాల్యూయేషన్ క్రియేషన్ ఇంజిన్. మేము ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ని జామ్‌నగర్‌లో 5,000 ఎకరాలలో అభివృద్ధి చేయడం ప్రారంభించాము.

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాలలో ఒకటి. ఈ కాంప్లెక్స్‌లో నాలుగు గిగా ఫ్యాక్టరీలు ఉంటాయి. మొదటిది ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్ ఫ్యాక్టరీ. రెండవది అధునాతన శక్తి నిల్వ బ్యాటరీ ఫ్యాక్టరీ. మూడవది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఎలక్ట్రోలైజర్ ఫ్యాక్టరీ. నాల్గవది హైడ్రోజన్‌ను మోటివ్ అండ్ స్టేషనరీ పవర్‌గా మార్చే ఇంధన సెల్ ఫ్యాక్టరీ. వచ్చే మూడు సంవత్సరాలలో  75,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నము. రిలయన్స్ భారతదేశానికి, భారతీయులకు పూర్తిగా ఇంటిగ్రేటెడ్, ఎండ్-టు-ఎండ్ పునరుత్పాదక ఇంధన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది ఇంకా అందిస్తుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ 2030 నాటికి 450GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.దీని నుండి రిలయన్స్ 2030 నాటికి కనీసం 100GW సౌర శక్తిని స్థాపించి, ప్రారంభిస్తుంది. ఇది స్థానిక వినియోగం కోసం గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగల కిలోవాట్ అండ్ మెగావాట్ స్కేల్ సౌర శక్తి ఉత్పత్తిదారుల పాన్-ఇండియా నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది. ఇంకా గ్రామీణ భారతదేశానికి అపారమైన ప్రయోజనాలు తెస్తుంది. ప్రారంభంలో కిలోకు 2 డాలర్ల కంటే తక్కువ ధరను తగ్గించడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్‌ను అత్యంత సరసమైన ఇంధన ఆప్షన్ గా మార్చడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రిలయన్స్ దూకుడుగా ఈ లక్ష్యాన్ని కొనసాగిస్తుందని దశాబ్దం రాకముందే సాధిస్తుందని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. భారతదేశం ఎల్లప్పుడూ సాహసోపేతమైన లక్ష్యాలను నిర్దేశించింది సాధించింది. ఒక దశాబ్దంలోపుగా కిలోకు 1 డాలర్లలోపు సాధించాలనే మరింత దూకుడు లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకోగలదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గ్రీన్ హైడ్రోజన్ కోసం 1-1-1 లక్ష్యం-1 దశాబ్దంలో 1 కిలోగ్రాముకు  1 డాలర్ సాధించిన ప్రపంచవ్యాప్త మొదటి దేశంగా భారతదేశం అవుతుంది. సంవత్సరాలుగా అసాధ్యమని అనిపించే అనేక లక్ష్యాలను భారతదేశం సాధించింది.

గ్రీన్ హైడ్రోజన్ కోసం ఈ 1-1-1 లక్ష్యాన్ని మా ప్రతిభావంతులైన యువ పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, ఆవిష్కర్తలు కూడా సాధిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ, మీరు కొత్త భారతదేశానికి రూపకర్త. కొత్త భారతదేశం గురించి మీ దృష్టి కొత్త అండ్ పునరుత్పాదక శక్తి ద్వారా ముందుకు వస్తుంది. ఇది మన లక్షలాది యువతకు న్యూ అండ్ హై వాల్యు గల గ్రీన్ ఉద్యోగాలను సృష్టిస్తుంది.ఇంకా భారతదేశంలోని గ్రీన్ ఎంటర్‌ప్రైజ్‌లకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

అలాగే భారతదేశాన్ని బిగ్ ఫజిల్ ఎనర్జీ దిగుమతిదారు నుండి క్లీన్ ఎనర్జి సొల్యూషన్ ఎగుమతిదారుగా మారుస్తుంది.ఇది భారతదేశంలో ఇంకా ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ డివైడ్‌ని కూడా కలుపుతుంది.మీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం ప్రపంచానికి ఒక గ్రీన్ ఎకనామిక్ మువ్మెంట్  టెంప్లెట్ అందజేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ఇది నిజంగా ప్రజా ఉద్యమం. భారతీయ పరిశ్రమలోని నా సహోద్యోగులందరి తరపున, రిలయన్స్ తరపున, నా తరపున మీ దృష్టి ఇంకా మిషన్‌కు పూర్తి మద్దతు, నిబద్ధతను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు అని ప్రసంగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios