రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) ఆన్‌లైన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ అర్బన్ లాడర్ హోమ్ డెకర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అర్బన్ లాడర్) ఈక్విటీ షేర్లను 182.12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) ఆన్‌లైన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ అర్బన్ లాడర్ హోమ్ డెకర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అర్బన్ లాడర్) ఈక్విటీ షేర్లను 182.12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
దీనికి సంబంధించి ‘అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్ సొల్యూషన్స్ లిమిటెడ్‌లో 96 శాతం వాటాను రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) రూ.182.12 కోట్లకు సొంతం చేసుకుంది’ అని ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
డిసెంబర్ 2023 వరకల్ల మరో రూ .75 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆర్‌ఆర్‌విఎల్ ప్రతిపాదించింది. ఈ పెట్టుబడులు డిసెంబర్ 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
also read బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకుంటే డబ్బు మాయం.. ...
ఈ కొనుగోలుకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది. ఈ–కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలతో పోటపోటీగా వినియోగదారులకు మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను అందుబాటులో తెచ్చేందుకు ఆర్‌ఐఎల్‌కు ఈ తాజా కొనుగోలు దోహదం చేయనుంది.
ఆర్‌ఆర్‌వీఎల్‌లో పలు అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలకు వాటా విక్రయాల ద్వారా గత రెండు నెలల్లో ఆర్‌ఐఎల్ రూ.47,265 కోట్ల భారీ నిధులను సమీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్‌ఆర్‌వీఎల్ విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరింది. రిలయన్స్ రిటైల్‌కు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 12,000 స్టోర్లు ఉన్నాయి.
