Asianet News TeluguAsianet News Telugu

Akash Ambani : వారసుడు వచ్చేశాడు..తండ్రికి తగ్గ తనయుడు, ఆకాశ్ అంబానీ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇవే...

ముఖేష్ అంబానీ తన గ్రూప్  టెలికాం విభాగం, రిలయన్స్ జియో బోర్డు డైరక్టర్ పదవి నుంచి రాజీనామా చేసి, పెద్ద కుమారుడు ఆకాష్‌కు కంపెనీ పగ్గాలను అప్పగించారు. 

Reliance Jio's Mukesh Ambani Steps Down as Director, Akash Ambani Appointed Chairman of Board
Author
Hyderabad, First Published Jun 28, 2022, 5:43 PM IST

దేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థలలో ఒకటైన రిలయన్స్ గ్రూప్‌లో, తదుపరి తరానికి కమాండ్ ఇచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఈ క్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ జియో బోర్డు చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అతని స్థానంలో రిలయన్స్ జియో బోర్డు ఛైర్మన్‌గా ఆకాష్ అంబానీ నియమితులయ్యారు.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ సమాచారాన్ని అందించింది. జూన్ 27న మార్కెట్‌ను మూసివేసిన తర్వాతే ముఖేష్ అంబానీ రాజీనామా చెల్లుబాటవుతుందని కంపెనీ పేర్కొంది. ఆకాష్ అంబానీని బోర్డు ఛైర్మన్‌గా చేయడం గురించి కూడా కంపెనీ తెలియజేసింది. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆకాష్‌ అంబానీని చైర్మన్‌గా నియమించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

బ్రౌన్ యూనివర్శిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేట్ అయిన ఆకాష్ అంబానీ కంటే ముందు, అతని తండ్రి ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా పని చూసేవారు. చైర్మన్ పదవికి ముకేశ్ అంబానీ రాజీనామా చేసి ఆకాష్ అంబానీని నియమించడం కొత్త తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించినట్లుగా భావిస్తున్నారు. అయితే జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ చైర్మన్‌గా ముఖేష్ అంబానీ కొనసాగనున్నారు.

రిలయన్స్ జియో కొత్త ఛైర్మన్ ఆకాశ్ అంబానీ గురించి..

>> రిలయన్స్ జియోలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆకాష్ అంబానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు. రిలయన్స్ జియో బోర్డు నుండి 65 ఏళ్ల ముఖేష్ అంబానీ నిన్న రాజీనామా చేసినట్లు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

>> ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో మేజర్ పట్టభద్రుడయ్యాడు. "రిలయన్స్ గ్రూప్ డిజిటల్ సర్వీసెస్ ను మెరుగు పరచడంలో సన్నిహితంగా పాలుపంచుకున్నాడు" ప్రస్తుతం 500 మిలియన్లకు పైగా ఉన్న వినియోగదారుల కోసం "కన్వర్జెన్స్ డివిడెండ్" సృష్టికి నాయకత్వం వహిస్తున్నాడు.

>> ఆకాష్ అంబానీ, జియో  4G చుట్టూ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడంలో సన్నిహితంగా పాలుపంచుకున్నారు. అతను 2017లో ఇండియా-స్పెక్స్ ఫోకస్డ్ జియోఫోన్‌ను ఆవిష్కరించి, ప్రారంభించడంలో ఇంజనీర్ల బృందంతో పాలుపంచుకున్నాడని కంపెనీ తెలిపింది. 

>> గత కొన్ని సంవత్సరాలుగా జియో చేసిన కీలక కొనుగోళ్లకు వ్యక్తిగతంగా ఆకాష్ చొరవ తీసుకున్నాడు. AI,బ్లాక్‌చెయిన్‌తో సహా కొత్త సాంకేతికతలు, సామర్థ్యాల అభివృద్ధిలో కూడా ఆసక్తిగా పాల్గొన్నాడు.

>> ఆకాష్ అంబానీ 2020లో శ్లోకా మెహతాను వివాహం చేసుకున్నారు. వారికి పృథ్వీ అనే కుమారుడు ఉన్నాడు.

>> ముఖేష్, నీతా అంబానీల ముగ్గురు పిల్లలలో ఆకాష్ అంబానీ పెద్దవాడు. అతనికి ఇషా అంబానీ అనే కవల సోదరి,  ఒక తమ్ముడు అనంత్ అంబానీ ఉన్నారు.

>> ఆన్‌లైన్ రిటైల్ వెంచర్ జియోమార్ట్ మరియు డిజిటల్ ఆర్మ్ జియో ప్లాట్‌ఫారమ్‌లతో పాటు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫుడ్ మరియు గ్రోసరీ, ఫ్యాషన్, జ్యువెలరీ, పాదరక్షలు మరియు దుస్తులను అందించే సూపర్ మార్కెట్‌లను నిర్వహిస్తున్న రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో ఆకాష్, ఇషా 2014 నుండి . ఉన్నారు

>> అనంత్ అంబానీ, ఇటీవల RRVL (రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్) లో డైరెక్టర్‌గా చేరారు. అతను 2020 నుండి జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు

వీరికి కూడా బోర్డులో చోటు దక్కింది
దీంతో పాటు అదనపు డైరెక్టర్లుగా రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరి నియామకానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. వీరిద్దరూ 5 సంవత్సరాల పాటు స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు. అదేవిధంగా రిలయన్స్ జియో మేనేజింగ్ డైరెక్టర్‌గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నియామకం జూన్ 27, 2022 నుండి వచ్చే 5 సంవత్సరాలకు వర్తిస్తుంది.

ముఖేష్ అంబానీ ప్లాన్ ఇదే...
తన తండ్రి ధీరుభాయ్ చేసిన తప్పును తాను చేయకుండా, గత ఏడాది నవంబర్‌లో, బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ తదుపరి తరానికి వ్యాపారాన్ని అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. చమురు నుండి టెలికాం వరకు విస్తరించి ఉన్న ఈ వ్యాపారం కోసం ముఖేష్ అంబానీ వాల్టన్ కుటుంబం మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ చైన్ అయిన వాల్‌మార్ట్ ఇంక్. వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్, 'కుటుంబాన్ని కేంద్రంగా ఉంచండి, కానీ నిర్వహణ నియంత్రణను వేరే చేతుల్లో పెట్టండి.'అనే సూత్రం అనుసరించి సక్సెస్ అయ్యారు. 

ధీరూభాయ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆమోదం..
గత ఏడాది తన తండ్రి ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖేష్ అంబానీ తొలిసారిగా వారసత్వం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు రిలయన్స్‌ నాయకత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రానున్న సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన. బలమైన కంపెనీలలో ఒకటిగా రిలయన్స్ అవతరించనుందని తన పిల్లలపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందులో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాలే కాకుండా రిటైల్, టెలికాం వ్యాపారం పాత్ర కీలకం కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios