Asianet News TeluguAsianet News Telugu

2016 నుండి 2020వరకు రిలయన్స్ జియో ప్రయాణం, విజయాలు

రిలయన్స్ జియో డేటా, వాయిస్, వీడియో కాల్స్ ఇంకా జియో యాప్స్ కంటెంట్ ను పూర్తిగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా 31 డిసెంబర్ 2016 వరకు అందుబాటులోకి ఉంచింది. రూ.2,999 రూపాయల నుండి ప్రారంభమయ్యే ట్రూ 4జి ఎల్‌టిఇ స్మార్ట్‌ఫోన్‌ల పరిచయం, 1,999 రూపాయలకు జియో-ఫై వైర్ లెస్ హాట్ స్పాట్, భారతీయులను జియో స్ట్రాంగ్ డేటా నెట్‌వర్క్‌ లోకి మారడానికి ఆసక్తి ఏర్పరిచింది. 

reliance Jio journey from 2016 to 2020: Announcements to Achievements
Author
Hyderabad, First Published Sep 5, 2020, 2:02 PM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గడిచిన నాలుగేళ్లలో రిలయన్స్ జియో ఎన్నో ఘనతలు సాధించింది. టెలికాం దిగ్గజలకు పోటీనిస్తూ తక్కువ సమయంలోని అత్యధిక వినియోగదారులతో ఇండియాలోనే టాప్ నెట్వర్క్ గా నిలిచింది. 


2016 ఏ‌జి‌ఎం - 1 సెప్టెంబర్

1.2 బిలియన్ల భారతీయులను, భారతదేశాన్ని డిజిటల్ రీవోల్యూషన్ లోకి తీసుకురావడానికి, దేశ ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా విజన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో నెట్వర్క్  ప్రారంభాన్ని ప్రకటించింది.

5 సెప్టెంబర్ 2016
రిలయన్స్ జియో డేటా, వాయిస్, వీడియో కాల్స్ ఇంకా జియో యాప్స్ కంటెంట్ ను పూర్తిగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా 31 డిసెంబర్ 2016 వరకు అందుబాటులోకి ఉంచింది. రూ.2,999 రూపాయల నుండి ప్రారంభమయ్యే ట్రూ 4జి ఎల్‌టిఇ స్మార్ట్‌ఫోన్‌ల పరిచయం, 1,999 రూపాయలకు జియో-ఫై వైర్ లెస్ హాట్ స్పాట్, భారతీయులను జియో స్ట్రాంగ్ డేటా నెట్‌వర్క్‌ లోకి మారడానికి ఆసక్తి ఏర్పరిచింది. జియో నెట్‌వర్క్‌ 100 మిలియన్ల కస్టమర్లను అతి తక్కువ సమయంలో పొందాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. 


2017 ఏ‌జిఎం- 21 జూలై
 

170 రోజుల్లోపు 100 మిలియన్లకు పైగా వినియోగదారులు జియోలోకి చేరారు. జియోలో సగటున ప్రతి రోజు సెకనుకు 7 మంది వినియోగదారులు చేరారు. జియో ప్రారంభించిన కేవలం 6 నెలల్లో భారతదేశంలో డేటా వినియోగం నెలకు 20 కోట్ల జిబి నుండి 120 కోట్ల జిబికి చేరుకుంది.

అప్పటినుండి ఇంటర్నెట్ వినియోగం పెరుగుదల నమోదైంది. జియో ఇండియా కా ఇంటెలిజెంట్ స్మార్ట్‌ఫోన్‌ జియో ఫోన్ కూడా పరిచయం చేసింది. ఆగస్టు 15 నుండి ఆర్‌ఐ‌ఎల్ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం డిజిటల్ ఫ్రీడంను ప్రకటించింది.

అలాగే జియోఫోన్ ను భారతీయులందరి కోసం అందుబాటులో ఉంచింది. జియో కస్టమర్లకు జియోఫోన్ ఉచితం. ఉచితంగా అయితే ఏదైనా దుర్వినియోగం చేయవచ్చని ఫ్రీ జియోఫోన్ ఆఫర్ దుర్వినియోగం కూకుండా ఉండడానికి ప్రతి జియోఫోన్ కస్టమర్ నుండి రూ.1,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌ను సేకరించాలని నిర్ణయించిది. జియోఫోన్ ఆగస్టు 15 నుండి బీటాలో యూసర్ టెస్ట్ కోసం, ఆగస్టు 24 నుండి ప్రీ-బుకింగ్ ద్వారా  అందుబాటులోకి తెచ్చింది.

2018 ఏ‌జి‌ఎం - 5 జూలై
 ప్రారంభమైన 22 నెలల్లోనే రిలయన్స్ జియో 215 మిలియన్ల కస్టమర్లను ప్రపంచంలో ఎక్కడా ఏ టెక్నాలజీ కంపెనీ కూడా సాధించలేకపోయారు. డేటా వినియోగం నెలకు 125 కోట్ల జీబీల నుంచి నెలకు 240 కోట్లకు పైగా పెరిగింది.


భారతదేశంలో 25 మిలియన్లకు పైగా జియోఫోన్ వినియోగదారులు.
జియోఫోన్ మన్ సూన్ హంగామా ఆఫర్ ప్రవేశ పెట్టింది.ఈ ఆఫర్లో భాగంగా జూలై 21 నుండి వారు తమ ప్రస్తుత ఫీచర్ ఫోన్‌ను సరికొత్త జియోఫోన్ కోసం కేవలం రూ .501కు ఎక్స్ ఛేంజ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆగస్టు 15 నుండి మా జియోఫోన్ 2 ప్రారంభ ధర కేవలం రూ.2999లకు మాత్రమే లభిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 నుంచి మీరు మైజియో యాప్ లేదా జియో.కామ్ రెండింటి ద్వారా జియోగిగా ఫైబర్ కోసం నమోదు చేసుకోవచ్చు.


2019 ఏ‌జి‌ఎం- ఆగస్టు 12
 ఆర్‌ఐఎల్ దాదాపు రూ.3.5 లక్షల కోట్లతో అతిపెద్ద ఆప్టికల్ ఫైబర్ తో భారతదేశం అంతటా అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించింది.

భారతదేశం అంతటా ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ లేదా ఐయోటి.
హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అండ్ ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్. చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాల కోసం బ్రాడ్‌బ్యాండ్. గత సంవత్సరం ఆగస్టు 15 నుండి మేము భారతదేశం అంతటా రిజిస్ట్రేషన్లను ఆహ్వానించాము, తద్వారా మేము అధిక ఆసక్తి గల ప్రాంతాలలో జియో ఫైబర్ కోసం  ప్రాధాన్యత ఇవ్వగలము.

దాదాపు 1,600 పట్టణాల నుండి మాకు 15 మిలియన్లకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. జియో ప్రారంభించిన మూడవ వార్షికోత్సవం సందర్భంగా 5వ సెప్టెంబర్ ప్రారంభించి - మేము జియో ఫైబర్ సేవలను వాణిజ్య ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని ఆర్‌ఐ‌ఎల్ ప్రకటించింది. ప్రతి బడ్జెట్, ప్రతి అవసరానికి అనుగుణంగా జియోఫైబర్ ప్లాన్‌లకు నెలకు రూ .700 నుండి రూ .10,000 మధ్య ధరతో నిర్ణయించింది.
 
2020 ఏ‌జి‌ఎం - 15 జూలై
 వచ్చే మూడు సంవత్సరాల్లో జియో ఒక హాఫ్ బిలియన్ మొబైల్ కస్టమర్లను కనెక్ట్ చేయడానికి బలమైన మార్గాన్ని చూడగలుగుతుంది అని అన్నారు . జియో మొదటి 5జి నెట్వర్క్ రూపొందించి, అభివృద్ధి చేసింది. భారతదేశంలో ప్రపంచ స్థాయి 5జి సేవలను ప్రారంభించటానికి సహాయపడుతుంది.

100% ఇండియన్ టెక్నాలజి ఉపయోగించి రూపొందించింది. మేడ్-ఇన్-ఇండియా 5జి సొల్యూషన్ 5జి స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చిన వెంటనే ట్రయల్స్‌కు, వచ్చే ఏడాది ఫీల్డ్ డిప్లాయ్‌మెంట్‌కు సిద్ధంగా ఉంటుంది. జియో కన్వర్జ్డ్, ఆల్-ఐపి నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్ కారణంగా మన 4జి నెట్‌వర్క్‌ను 5జికి సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు.  

ప్రస్తుత ఖర్చులో కొంత భాగానికి ఎంట్రీ లెవల్ 4జి లేదా 5జి స్మార్ట్‌ఫోన్ డిజైన్ చేయగలమని మేము నమ్ముతున్నాము. కానీ, అటువంటి ఇంజనీరింగ్ స్మార్ట్‌ఫోన్‌కు శక్తినివ్వడానికి, మనకు సమానమైన విలువ కలిగిన ఇంజనీరింగ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అవసరం.

అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌ను భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడానికి గూగుల్, జియో భాగస్వామ్యంలో ఉన్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్ పరికరాన్ని ఉంచే లక్ష్యాన్ని వేగవంతం చేయగలమని మాకు నమ్మకం ఉంది అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios