Asianet News TeluguAsianet News Telugu

త్వరలో జియో లోకాస్ట్ 5జి‌ స్మార్ట్‌ ఫోన్‌లు.. డేటా ప్యాక్‌ కూడా..

డేటా ప్యాక్‌లతో కూడిన లోకాస్ట్ స్మార్ట్ ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని తెలిపింది. ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ ప్రకటించింది.
 

Reliance Jio  10 crore low-cost Android phones by December: Report
Author
Hyderabad, First Published Sep 9, 2020, 5:41 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరో సంచలనం సృష్టించడానికి సిద్దమవుతుంది. ఆర్‌ఐ‌ఎల్ లో వరుస పెట్టుబడులు తరువాత లోకాస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను తయారీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లో గూగుల్ ఆండ్రాయిడ్  ద్వారా తక్కువ ధరతో కూడిన 10 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ల తయారు చేయాలని చూస్తోందని తెలిపింది.

డేటా ప్యాక్‌లతో కూడిన లోకాస్ట్ స్మార్ట్ ఫోన్‌లను 2020 డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయవచ్చని తెలిపింది. ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్ డిజిటల్ యూనిట్లో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు జూలైలో రిలయన్స్ ప్రకటించింది.

also read బోట్‌ కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. ...

 బిలియనీర్ ముఖేష్ అంబానీ జూలైలో రిలయన్స్ డిజైన్ చేసే తక్కువ ఖర్చుతో కూడిన "4 జి లేదా 5 జి" స్మార్ట్‌ఫోన్‌కు శక్తినిచ్చేలా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ను నిర్మిస్తుందని చెప్పారు.

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 33% వాటాను విక్రయించడం ద్వారా రూ.1.52 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించింది. ఫేస్‌బుక్ ఇంక్, ఇంటెల్, క్వాల్కమ్‌లతో సహా ప్రపంచ దిగ్గజ కంపెనీలు  కూడా ఇందులో భారీగా పెట్టుబడులను పెట్టిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios