ప్రముఖ రీటైల్ సంస్థ రిలయన్స్.. పంద్రాగస్టుని పురస్కరించుకొని భారీ ఆఫర్లు ప్రకటించింది.ఫుల్ పైసా వసూల్ సేల్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫ‌ర్.. ఆగ‌స్టు 11 నుంచి 15(బుధ‌వారం వరకు) అందుబాటులో ఉంటుంద‌ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్ కింద పాల ఉత్పత్తులపై 25 శాతం రాయితీ, బిస్కెట్లు, స్పైసెస్‌లపై రెండు కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే మరో డియోడ్రెంట్, షాంప్‌లు ఉచితంగా అందిస్తున్నది. వీటితోపాటు పేటీఎం వ్యాలెట్‌పై రూ.75 క్యాష్‌బ్యాక్ ఆఫర్, మొబిక్విక్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.
 
న‌గ‌దు, కార్డు ద్వారా కొనుగోళ్లు జ‌రిపే వారికి రాయితీలు అందించ‌నున్న‌ది రిల‌య‌న్స్. క‌నీసం రూ.2500 విలువ చేసే షాపింగ్ జ‌రిపితే క‌నీసం 5% క్యాష్ బ్యాక్ స‌దుపాయం క‌ల్పిస్తారు. గ‌రిష్ట క్యాష్ బ్యాక్ రూ.500కు మించ‌కుండా క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ వ‌ర్తింప‌జేస్తారు. రిల‌య‌న్స్ స్వాతంత్ర దినోత్స‌వ ఆఫ‌ర్లు ఆగ‌స్టు 15న ముగుస్తాయి.