న్యూయార్క్ మెట్‌లో బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ : రిలయన్స్ ఫౌండేషన్‌తో అండగా నిలిచిన నీతా అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ‘‘ట్రీ అండ్ సర్పెంట్ : ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇన్ ఇండియా , 200 బీసీఈ - 400 సీఈ’ పేరుతో న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (ది మెట్)లో జరగనున్న ప్రదర్శనకు అండగా నిలిచారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ‘‘ట్రీ అండ్ సర్పెంట్ : ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇన్ ఇండియా , 200 బీసీఈ - 400 సీఈ’ పేరుతో న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (ది మెట్)లో జరగనున్న ప్రదర్శనకు అండగా నిలిచారు. జూలై 21 నుంచి ఈ ప్రదర్శన జరగనుంది. 200 బీసీఈ నుంచి 400 సీఈ వరకు వున్న బౌద్ధ శిల్ప కళ మూలాలను హైలెట్ చేసే 125కి పైగా వస్తువులను ప్రదర్శించనున్నారు. భారతదేశంలో బౌద్ధానికి పూర్వం వున్న అలంకారిక శిల్పం రెండింటిని బహిర్గతం చేయడానికి, ఇంటర్‌లాకింగ్ థీమ్‌ల శ్రేణిని ప్రదర్శించనున్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఈ ప్రదర్శన కోసం ఎంతగానో సహకరించారు. జూలై 21 నుంచి నవంబర్ 13 వరకు ది మెట్‌లో ప్రదర్శన జరగనుంది. నీతా అంబానీ 2019లో ది మెట్ గౌరవ ట్రస్టీగా ఎంపికైన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియం ట్రస్టీ బోర్డులో స్థానం సంపాదించిన తొలి భారతీయ వ్యక్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. తాను బుద్ధుని భూమి అయిన భారతదేశం నుంచి వచ్చానని తెలిపారు. ది మెట్, రిలయన్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ట్రీ అండ్ సర్పెంట్‌కి మద్ధతు ఇవ్వడం తనకు దక్కిన గౌరవంగా నీతా అంబానీ పేర్కొన్నారు. బౌద్ధమతం, భారతదేశం మధ్య లోతైన సంబంధాన్ని ప్రదర్శించడంలో తాము చాలా గర్వపడుతున్నామన్నారు. బుద్ధుని బోధనలు భారతీయ నీతితో ముడిపడి వున్నాయని నీతా అంబానీ పేర్కొన్నారు.
సోమవారం ది మెట్‌లో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రివ్యూ నిర్వహించారు. ప్రివ్యూకు అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, నీతా అంబానీ , ఎన్ఆర్ఐలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ట్రీ అండ్ సర్పెంట్ భారతదేశంలో అలంకారిక శిల్పం, బౌద్ధం పుట్టడం ముందు నాటి మూలాలు, ప్రారంభ భారతీయ కళలో నిర్మాణానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు. బౌద్ధ కళలోని రెండు ప్రాథమిక మూలాంశాలు - పవిత్రమైన బోధి చెట్టు, ప్రొటెక్టివ్ పామును పెట్టారు.
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ 1870లో అమెరికన్ పౌరుల బృందం, వ్యాపారవేత్తలు, సంపన్నులు, ఆనాటి ప్రముఖ కళాకారులు, మేధావుల సహకారంతో స్థాపించారు. అమెరికన్లకు కళ, కళకు సంబంధించిన విద్యను అందించడానికి ఒక కేంద్రం వుండాలనే ఉద్దేశంతో ది మెట్‌కు రూపకల్పన చేశారు. అలా ప్రారంభమైన మెట్‌లో ప్రపంచంలోని వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన 5000 ఏళ్ల నాటి కళను, కళాఖండాలను పరిచయం చేసేలా 10,000కు పైగా వస్తు సంపద వుంది.