Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక పానీయాల బ్రాండ్ ఎలిఫెంట్ హౌస్‌తో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒప్పందం

రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్), ఎఫ్ఎంసీజీ విభాగం, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీఎల్) శ్రీలంకలోని అతిపెద్ద లిస్టెడ్ కాంగ్లోమెరేట్ అయిన జాన్ కీల్స్ హోల్డింగ్స్ పీఎల్‌సీ అనుబంధ సంస్థ అయిన సిలోన్ కోల్డ్ స్టోర్స్ పీఎల్‌సీ యాజమాన్యంలోని ఎలిఫెంట్ హౌస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 

Reliance Consumer Products Limited announces partnership with leading Sri Lankan beverage brand Elephant House ksp
Author
First Published Feb 28, 2024, 6:56 PM IST

రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్), ఎఫ్ఎంసీజీ విభాగం, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీఎల్) పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ. తయారీ, మార్కెట్‌ విభాగాలు శ్రీలంకలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎలిఫెంట్ హౌస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రకటించింది. భారతదేశమంతటా ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ కింద పానీయాలను పంపిణీ చేయడం, విక్రయించడం చేయనుంది. Campa, Sosyo , Raskik వంటి దిగ్గజ బ్రాండ్‌లను కలిగివున్న ఆర్‌సీపీఎల్ తన పెరుగుతున్న పానీయాల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడంలో సహాయపడటమే కాకుండా అసాధారణమైన కొత్త ఉత్పత్తులను కూడా మార్కెట్‌లోకి తీసుకురానుంది. 

ఎలిఫెంట్ హౌస్ అనేది శ్రీలంకలోని అతిపెద్ద లిస్టెడ్ కాంగ్లోమెరేట్ అయిన జాన్ కీల్స్ హోల్డింగ్స్ పీఎల్‌సీ అనుబంధ సంస్థ అయిన సిలోన్ కోల్డ్ స్టోర్స్ పీఎల్‌సీ యాజమాన్యంలో వుంది. ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ క్రింద.. ఇది నెక్టో, క్రీమ్ సోడా, ఈజీబీ (జింజర్ బీర్), ఆరెంజ్ బార్లీ, లెమనేడ్ వంటి అనేక రకాల పానీయాలను తయారు చేసి విక్రయిస్తుంది. ఈ ఒప్పందంపై రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సీవోవో, కేతన్ మోడీ మాట్లాడుతూ.. బలమైన మార్కెట్ విశ్వసనీయతను కలిగిన ఎలిఫెంట్ హౌస్ ఘనమైన వారసత్వం కలిగిన ఐకానిక్ బ్రాండ్ అన్నారు.

ఈ భాగస్వామ్యం తమ అభివృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోకు దానిని అత్యంత ఇష్టపడే పానీయాలను జోడించడమే కాకుండా భారతీయ వినియోగదారులకు గొప్ప ఎంపిక, విలువను కూడా అందిస్తుందన్నారు. నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా భారతదేశంలోని అనేక ప్రఖ్యాత గ్లోబల్ బ్రాండ్‌లకు సంరక్షుడిగా వున్న రిలయన్స్.. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్‌ను మరింత విస్తరించేందుకు సన్నద్ధమైందని మోడీ పేర్కొన్నారు. 

 

Reliance Consumer Products Limited announces partnership with leading Sri Lankan beverage brand Elephant House ksp

 

జాన్ కీల్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ క్రిషన్ బాలేంద్ర మాట్లాడుతూ.. ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్‌ను భారత మార్కెట్‌కు విస్తరించడం పట్ల తాము గర్విస్తున్నామన్నారు. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో మా భాగస్వామ్యం మా హెరిటేజ్ బ్రాండ్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని బాలేంద్ర తెలిపారు. కొత్త వినియోగదారుల విభాగాలకు మా అధిక నాణ్యత పానీయాలను అందించడంలో మా నిబద్ధతను సూచిస్తుందని.. ఈ భాగస్వామ్యం కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు.

భారతీయ వినియోగదారుల విభిన్న ప్రాధాన్యతలను తీర్చడానికి రిఫ్రెష్, వినూత్నమైన పానీయాల ఎంపికలను అందిస్తామని బాలేంద్ర వెల్లడించారు. ఆర్‌సీపీఎల్, ఎలిఫెంట్ హౌస్ మధ్య ఒప్పందం శ్రేష్టత , ఆవిష్కరణల పట్ల భాగస్వామ్య నిబద్ధతను నొక్కి చెబుతుంది. సినర్జీలను ఉపయోగించుకోవడానికి , వారి మార్కెట్ ఉనికిని పెంచుకోవడానికి రెండు సంస్థలకు అధికారం ఇస్తుంది. 

ఆర్‌సీపీఎల్ విజన్ భారతీయ వినియోగదారులకు వారి అసాధారణమైన నాణ్యత , విలువ కోసం ప్రత్యేకంగా నిలిచే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌లు, ఉత్పత్తుల విస్తృత పోర్ట్‌ఫోలియోను అందించడం. దీనికి అదనంగా విభిన్న మార్కెట్‌లలో ఎక్కువ మంది వినియోగదారులను చేరుకోవడానికి ఆర్‌సీపీఎల్ తన బహుళ ఛానెల్ కార్యకలాపాలను వేగంగా పెంచుతుంది.

రిలయన్స్ ప్రస్తుతం లోటస్ నుంచి విస్తృతమైన కాంపా, సోస్యో హజూరితో సహా ఐకానిక్ పానీయాల బ్రాండ్‌లతో కూడిన బహుముఖ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోను కలిగి వుంది. శ్రీలంకకు చెందిన ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ మాలిబాన్ కాకుండా చాక్లెట్‌లు, టోఫీమాన్, అలన్స్ బగ్ల్స్, మస్తీ ఓయ్ వంటి స్నాక్స్, ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద స్టేపుల్స్ , రోజువారీ సౌకర్యవంతమైన ఉత్పత్తులతో పాటు గృహ, వ్యక్తిగత సంరక్షణలో డిష్‌వాషింగ్ లిక్విడ్‌లు, లాండ్రీ డిటర్జెంట్, సబ్బులు, టాయిలెట్ క్లీనర్‌ల వంటి ఉత్పత్తులను కలిగి వుంది. 

సిలోన్ కోల్డ్ స్టోర్స్ పీఎల్‌సీ.. ఎలిఫెంట్ హౌస్ బ్రాండ్ తయారీదారు, పంపిణీదారు. జాన్ కీల్స్ హోల్డింగ్స్ పీఎల్‌సీ అనుబంధ సంస్థ. ఇది కొలంబో స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్ అయితన కాంగ్లోమెరేట్. 7 విభిన్న పరిశ్రమ రంగాల్లో 70కి పైగా కంపెనీలతో పనిచేస్తోంది. 150 సంవత్సరాల చరిత్రలో జాన్ కీల్స్ గ్రూప్ 14 వేల మందికి పైగా ఉద్యోగాలను అందిస్తుంది. ఎల్ఎండీ మ్యాగజైన్ ద్వారా గత 18 ఏళ్లుగా శ్రీలంకలో అత్యంత గౌరవనీయమైన సంస్థగా నిలిచింది. జాన్ కీల్స్ హోల్డింగ్స్ పీఎల్‌సీ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక ద్వారా ట్రాన్స్‌పరెన్సీ ఇన్ కార్పోరేట్ రిపోర్టింగ్ అసెస్‌మెంట్‌లో వరుసగా మూడో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పూర్తి సభ్యుడిగా, యూన్ గ్లోబల్ కాంపాక్ట్‌లో భాగస్వామిగా జేకేహెచ్ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.

ఇక ఆర్ఆర్‌వీఎల్ విషయానికి వస్తే.. దాని అనుబంధ సంస్థల ద్వారా గ్రోసరీ , కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, ఫార్మా వినియోగ బాస్కెట్‌లలో 18700 స్టోర్‌లు, డిజిటల్ కామర్స్ ఫ్లాట్‌ఫాంల సమీకృత ఓమ్ని ఛానెల్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్, ఫార్మా వినియోగ బాస్కెట్‌లు, దాని కొత్త ఒమర్స్ చొరవ ద్వారా 3 మిలియన్లకు పైగా వ్యాపారులతో భాగస్వామ్యం కలిగి వుంది. దాని ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ , మిలియన్ల కొద్దీ భారతీయుల రోజువారీ అవసరాలను అందించే బహుముఖ బ్రాండ్ పోర్ట్‌ఫోలియో కింద విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆర్ఆర్‌వీఎల్ మార్చి 31 , 2023తో ముగిసిన సంవత్సరానికి గాను రూ.2,60,364 కోట్లు (31.7 బిలియన్లు), నికర లాభం రూ.9,181 కోట్లు (1.1 బిలియన్ డాలర్లు) ఏకీకృత టర్నోవర్‌ను నివేదించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios