రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి (RBI Monetary Policy) విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ గురువారం వివరించారు.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రియల్ జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అంచనా వేస్తోంది. 8వ తేదీన ప్రారంభమై, 10వ తేదీన ముగిసింది మానిటరీ పాలసీ. నేడు (10, ఫిబ్రవరి) ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) MPC సమావేశం నిర్ణయాలను మీడియాకు తెలిపారు. రెపో రేటునును వరుసగా పదవసారి 4 శాతంగా స్థిరంగా కొనసాగించింది. అవసరమైనంత కాలం అనుకూల వైఖరి కొనసాగుతుందని శక్తికాంతదాస్ తెలిపారు. ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటును 4.25 శాతం వద్ద మారలేదు. రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగించింది.

రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి(RBI Monetary Policy) విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ గురువారం వివరించారు. కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగకపోవడం, అధిక ద్రవ్యోల్బణ భయాల కారణంగా ఈ సారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. రెపోరేటు 4 శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపోరేటును 3.35శాతంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ఈ సారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు వెల్లడించారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది పదో సారి.

FY23లో జీడీపీ వృద్ధి రేటును 7.8 శాతంగా అంచనా వేస్తోంది. త్రైమాసికం పరంగా చూస్తే మొదటి త్రైమాసికంలో 7.2 శాతం, రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడో త్రైమాసికంలో 4.3 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా వేస్తున్నారు. FY23 రెండో అర్ధ సంవత్సరంలో సీపీఐ ద్రవ్యోల్భణం 4.00 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిపారు. FY22లో సీపీఐ ద్రవ్యోల్భణం అంచనాలు 5.3 శాతంగా అంచనా వేస్తున్నారు. FY23లో సీపీఐ ద్రవ్యోల్భణం 4.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సీపీఐ ద్రవ్యోల్భణం Q1 FY23లో 4.9 శాతం, Q2 FY23లో 5 శాతం, Q3 FY23లో 4 శాతం, Q4 FY23లో 4.2 శాతంగా అంచనా వేస్తున్నారు.

2022 ఫిబ్రవరి 10న 14వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్‌ ముఖ్యాంశాలపై చర్చించారు. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్‌ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లతో కూడిన ఆర్‌బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తోంది.