Asianet News TeluguAsianet News Telugu

మార్చికల్లా $పై రూపాయి 73?: ద్రవ్యలోటు ప్లస్ క్యాడ్ లక్ష్యాలు డౌటే!!

వచ్చే మార్చి నెలాఖరు నాటికి డాలర్ పై రూపాయి మారకం విలువ 73కు పడిపోతుందని స్విస్ బ్రోకరేజీ ‘యూబీఎస్’ హెచ్చరించింది. దీనివల్ల ద్రవ్యలోటు, కరంట్ ఖాతా లోటు లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం వెనుకబడుతుందని సంకేతాలు ఉన్నాయని యూబీఎస్ తెలిపింది.

Re to hit 73 by Mar 2019; fisc target to be breached: Report
Author
New Delhi, First Published Sep 11, 2018, 7:33 AM IST

ముంబై: ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి. కానీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీఓపీ)లో నెగిటివ్ నమోదై, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నదని స్విస్ బ్రోకరేజీ సంస్థ ‘యూబీఎస్’ పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి డాలర్‌పై రూపాయి మారకం విలువ 73కు పతనమవుతుందని అంచనా వేశారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తగ్గుదల, పెట్టుబడుల ఉపసంహరణలో వైఫల్యం భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యూబీఎస్ తెలిపింది. దీనివల్ల ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు, కరంట్ ఖాతా లోటు (సీఏడీ) లక్ష్యాలను మిస్ అవుతుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ద్రవ్యలోటు 6.5 శాతానికి చేరే చాన్స్


పరిస్థితి ఇలాగే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఘటితమైన ద్రవ్యలోటు 6.5 శాతాన్ని తాకుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు రూపాయి విలువ 12 శాతం పతనం కావడంతో విదేశీ చెల్లింపులు బలహీన పడతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 2018- 19 ఆర్థిక సంవత్సరంలో కరంట్ ఖాతా లోటు 2.5 నుంచి 2.7 శాతానికి పెరిగే అవకాశం ఉన్నదని యూబీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. 

అంతర్జాతీయ చెల్లింపుల్లో ఏడేళ్లలో తొలిసారి ఒకశాతం లోటు


ప్రత్యేకించి అంతర్జాతీయంగా చెల్లింపుల్లో భారత జీడీపీలో ఒక్కశాతం లోటు ఏర్పడుతుందని యూబీఎస్ హెచ్చరించింది. ఇది ఏడేళ్లలో మొదటిసారి అని పేర్కొంది. ఇదే పరిస్థితి వచ్చే ఆర్థిక సంవత్సరంపైనా పడుతుందని తెలిపింది. ఏడేళ్ల క్రితం రూపాయి మారకం విలువ 66 నుంచి వచ్చే మార్చి నెలాఖరు నాటికి 73కు పతనమైందని చేరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటు 7 నుంచి 7.3 శాతానికి పడిపోతుందని యూబీఎస్ పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారుతాయన్నది. ద్రవ్యలోటు లక్ష్యం 3.3గా ప్రభుత్వం నిర్దేశించుకున్నది. కానీ జీఎస్టీ వసూళ్లు రూ.30 వేల కోట్ల వరకు తగ్గే అవకాశం ఉన్నదని సంకేతాలు కనిపిస్తున్నాయి. 

పెట్రో సుంకాల తగ్గింపు లేనట్టే


పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వాటిపై ఎక్సైజ్, ఇతర సుంకాలను తగ్గించేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్న వార్తలు వెలువడుతున్నాయి. ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తగ్గింపుతో తీవ్రమైన ఆర్థికలోటుకు దారితీసే అవకాశం ఉండటంతో కేంద్రం కానీ, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందుకు సుముఖంగా లేవని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.19.48 ఉండగా, డీజిల్‌పై రూ.15.33 ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం ద్వారా రూ.1,84,091కోట్లను ఆర్జించింది. ఒకవేళ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ పోతే ఆ మేరకు ఆదాయంపై ప్రభావం పడుతుంది.

ద్రవ్యలోటు పెరిగితే సంక్షేమానికి కోత పెట్టాల్సిందే


ఫలితంగా ద్రవ్యలోటు ఏర్పడటంతోపాటు సంక్షేమపథకాల కేటాయింపుల్లో కోత పెట్టాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థికవ్యవస్థలో సున్నితమైన పరిస్థితులు నెలకొన్నందున, ప్రభుత్వం సాహసాలకు సిద్ధపడకపోవచ్చునని వారంటున్నారు. పెట్రోల్, డీజిల్‌పై ఆయా రాష్ర్టాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను వసూలు చేస్తున్నాయి. దీంతోపాటు కేంద్రం వసూలు చేస్తున్నదాంట్లో 42శాతం రాష్ర్టాలకు దక్కుతున్నది. వ్యాట్ ఒక్కో రాష్ర్టానికి ఒక్కోరకంగా ఉంది. లీటర్ ధరను ఒక్కరూపాయి తగ్గించేదిశగా పన్నును కుదించినా, రాష్ట్ర ఖజానాకు వచ్చే వార్షిక ఆదాయం వేల కోట్ల రూపాయలు తగ్గుతుంది. ఇలాంటి స్థితిలో రాష్ర్టాలు పన్ను తగ్గింపునకు చొరవ చూపకపోవచ్చు అని మరో అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios