RD rate hike: SBI సహా ఈ బ్యాంకుల్లో రికరింగ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..
మనం కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేసుకోవడానికి ఎన్ని రకాల పథకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు ప్రవేశపెట్టే ఫిక్స్డ్ డిపాజిట్ అదే విధంగా రికరింగ్ డిపాజిట్ పథకాల్లో డబ్బులు దాచుకోవడానికే జనం ఎక్కువగా ఇష్టపడుతుంటారు దీనికి కారణం లేకపోలేదు స్టాక్ మార్కెట్లో అయితే డబ్బు చాలా రిస్క్ అనే చెప్పాలి అదే బ్యాంకులు నడిపే ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు మీ డబ్బు గ్యారెంటీగా తిరిగి వస్తుంది అంతే కాదు మీ డబ్బుపై వడ్డీ కూడా వస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను మార్పు అనంతరం ఫిక్స్‌డ్ డిపాజిట్లు మాత్రమే కాకుండా, రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. చాలా బ్యాంకుల్లో, ఆర్‌డిపై వడ్డీ దాదాపు 10 శాతానికి చేరుకుంది. మే 2022లో రెపో రేటు 4.4 శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ , రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చాలా రకాల బ్యాంకుల్లో ఒకే విధంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ బ్యాక్కులు అందిస్తున్నటువంటి రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SSFB)
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (SSFB) సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల RD పై 9.6శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సాధారణ పౌరుడు RD పై 9.1 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్ల ద్వారా నెలవారీ రూ. 5000 ఆర్డీ 5 సంవత్సరాలలో రూ.3.85 లక్షలకు పెరుగుతుంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూనిటీ బ్యాంక్) సీనియర్ సిటిజన్లకు 1001 రోజుల డిపాజిట్లపై 9.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. యూనిటీ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 8.15 శాతం వడ్డీని ఇస్తోంది. అదే సమయంలో, సాధారణ పౌరులు 1001 రోజుల డిపాజిట్‌పై 9.1 శాతం వడ్డీని , 5 సంవత్సరాల RDపై 7.65 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్ ద్వారా నెలవారీ రూ.5000 ఆర్డీ 5 సంవత్సరాలలో రూ.3.7 లక్షలకు పెరుగుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల RD పై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లు RD పై 6.6 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ ద్వారా నెలవారీ రూ. 5000 ఆర్డీ 5 సంవత్సరాలలో దాదాపు రూ. 3.6 లక్షల వరకు చేరుతుంది.
HDFC బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల ఆర్‌డిపై 7.5శాతం వడ్డీని కూడా ఇస్తోంది. అదే సమయంలో, సాధారణ పౌరుడు RD పై 7 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్ ద్వారా నెలవారీ రూ. 5000 RD 7.5 శాతం వడ్డీతో 5 సంవత్సరాలలో దాదాపు రూ. 3.6 లక్షల వరకు ఉంటుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 7.5 సంవత్సరాలు , 10 సంవత్సరాల ఆర్‌డి కోసం 7.75 శాతం వడ్డీని ఇస్తోంది.
ICICI బ్యాంక్
ICICI బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల RD పై 7.5శాతం వడ్డీని అందిస్తోంది. ఇతరులు 5 సంవత్సరాల RD పై 6.9శాతం వడ్డీని పొందవచ్చు. ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్ ద్వారా నెలవారీ రూ. 5000 RD 5 సంవత్సరాలలో సుమారు రూ. 3.6 లక్షలకు పెరుగుతుంది.