Asianet News TeluguAsianet News Telugu

పండగ వేళ షాక్ ఇచ్చిన ఆర్బీఐ, వరుసగా మరోసారి రెపోరేటు పెంపుదల, కొత్త కారు కొంటే ఎంత ఈఎంఐ కట్టాలంటే..

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే లోన్ ద్వారా కారు కొనాలని చూస్తున్నవారికి ఆర్బీఐ పెద్ద షాక్ ఇచ్చింది. వరుసగా మరో సారి 0.50 శాతం రెపోరేటు పెంచడంతో, బ్యాంకులు తమ కస్లమర్లకు ఇచ్చే లోన్లపై వడ్డీ అమాంతం పెరిగిపోయింది. ఇకపై మీరు కారును బ్యాంకు లోన్ ద్వారా తీసుకుంటే మీ ఈఎంఐ ఎంత పెరిగిందో తెలుసుకోండి. 

RBI which gave a shock during the festival increased the rate once again in a row how much EMI to pay for buying a new car
Author
First Published Sep 30, 2022, 9:39 PM IST

పండుగల సీజన్ ప్రారంభమైంది. కానీ ఆర్బీఐ మాత్రం సామాన్యులకు షాకిస్తూ వరుసగా నాలుగోసారి రెపో రేటును పెంచి సామాన్యులపై ఈఎంఐ భారాన్ని పెంచింది. దేశంలోని అతిపెద్ద రుణదాత SBI తన కార్ లోన్ వడ్డీ రేట్లలో సెప్టెంబర్ 5న కొద్దిగా తగ్గింపునిచ్చింది, కానీ ఇప్పుడు మళ్లీ కార్ లోన్ వడ్డీ రేట్లు 8 శాతానికి పైగా పెరిగాయి. SBI కార్ కాలిక్యులేటర్ ప్రకారం, రెపో రేటు పెరిగిన తర్వాత, కారు లోన్ EMI రూ. 250 వరకు పెరగవచ్చు. 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల కాలవ్యవధితో 10 లక్షల కార్ లోన్ కోసం మీ EMI ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం. 

7 సంవత్సరాల కాలవ్యవధితో  కార్ లోన్ EMI
లోన్ మొత్తం: రూ. 10,00,000
SBI కార్ లోన్ వడ్డీ రేటు: 7.85%
లోన్ EMI: రూ. 15,512
SBI కార్ లోన్ వడ్డీ రేటు: రెపో పెంపు తర్వాత 8.35 శాతం
లోన్ EMI అంచనా: రూ. 15,671
EMI ఎంత పెరిగింది: రూ. 249

5 సంవత్సరాల కాలవ్యవధితో కార్ లోన్ EMI
లోన్ మొత్తం: రూ. 10,00,000
SBI కార్ లోన్ వడ్డీ రేటు: 7.85%
లోన్ EMI: రూ. 20,205
SBI కార్ లోన్ వడ్డీ రేటు అవకాశం: రెపో పెంపు తర్వాత 8.35 శాతం
లోన్ EMI అంచనా: రూ. 20,444
EMI ఎంత పెరిగింది: రూ. 239

3 సంవత్సరాల కాలవ్యవధి కోసం కార్ లోన్ EMI
లోన్ మొత్తం: రూ. 10,00,000
SBI కార్ లోన్ వడ్డీ రేటు: 7.85%
లోన్ EMI: రూ. 31,267
SBI కార్ లోన్ వడ్డీ రేటు అవకాశం: రెపో పెంపు తర్వాత 8.35 శాతం
లోన్ EMI అంచనా: రూ. 31,498
EMI ఎంత పెరిగింది: రూ. 231
 

Follow Us:
Download App:
  • android
  • ios