ఇప్పటి వరకు మార్కెట్లోకి కొత్త రూ.2వేల నోటు, రూ.100, రూ.500, రూ.50, రూ.200, రూ.10 నోట్లను చూసే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లోకి రూ.20నోటు అడుగుపెట్టనుంది.
ఇప్పటి వరకు మార్కెట్లోకి కొత్త రూ.2వేల నోటు, రూ.100, రూ.500, రూ.50, రూ.200, రూ.10 నోట్లను చూసే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లోకి రూ.20నోటు అడుగుపెట్టనుంది. మహాత్మగాంధీ సిరీస్ లో ఈ రూ.20నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రూ.20నోటు ఎరుపు రంగులో ఉంటుంది. కాగా.. ఈ కొత్త నోటు ఆకుపచ్చ, పసుపు రెండు రంగుల కాంబినేషన్ లో ఉంటుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దీంతోపాటు అశోకుడి స్తంభం కూడా ఉంటుంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్ లోగో కూడా ఉంటుంది.
RBI to issue new Rs 20 denomination banknotes
— ANI Digital (@ani_digital) April 27, 2019
Read @ANI Story | https://t.co/21cKbB1KQL pic.twitter.com/IytRIPs2OC
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 27, 2019, 1:15 PM IST