ముంబై: కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ మధ్య వినియోగదారుల నమ్మకం చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) విడుదల చేసిన సర్వేలో తేలింది.

కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ప్రకారం, కరెంట్ సిచ్చువేషన్ ఇండెక్స్ (సిఎస్ఐ) చారిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. ఒక సంవత్సరం ముందు ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్ (ఎఫ్ఇఐ) కూడా భారీ పతనాన్ని నమోదు చేసింది. ఆర్‌బిఐ విడుదల చేసిన కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ( సిసిఎస్)

ప్రకారం సాధారణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి, గృహ ఆదాయంపై వినియోగదారుల నమ్మకం చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయిందని తెలిపింది. అయితే సాధారణ ఆర్థిక పరిస్థితి, రాబోయే సంవత్సరానికి ఉపాధిపై అంచనాలు కూడా నిరాశాను కలిగిస్తున్నాయి.

also read విజయ్ మాల్యా అప్పగింత మరింత ఆలస్యం!!


కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని మే 5 నుండి 17 తేదీలలో దేశంలోని పదమూడు ప్రధాన నగరాల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే జరిగింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, భూపాల్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోలకతా, లక్నో, ముంబై, పాట్నా, తిరువనంతపురంలో నిర్వహించారు.

మరొక సర్వే ప్రకారం 5,300 ఇళ్ల నుండి సాధారణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరల పరిస్థితి, ఆదాయం, వ్యయంపై అవగాహన ఇంకా అంచనాలను సేకరించారు.

'హౌస్‌హోల్డ్స్' ద్రవ్యోల్బణ అంచనాల సర్వేపై ఆర్‌బిఐ మరో అధ్యయనం నిర్వహించింది.ఇది గృహాల ద్రవ్యోల్బణ అవగాహన ఇంకా అంచనాలను మార్చి 2020 లో పోల్చితే 2020 మేలో భారీగానే పెరిగింది.

ఈ సర్వేలో పాల్గొన్నవారు ఎక్కువగా ఆహార ఉత్పత్తులపై ధరల ఒత్తిడిని పేరగనున్నట్టు ఆశిస్తూన్నారు. ఈ సర్వేలో మొత్తం 5,761 కుటుంబాలు పాల్గొన్నాయి.