ముంబయి: స్పొర్ట్స్ స్టార్స్ తరువాత ఆర్థిక మోసాలపై కస్టమర్లలో అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది. ఆర్‌బిఐ పబ్లిక్ అవేర్‌నెస్ లో భాగంగా వినియోగదారులు సురక్షితమైన లావాదేవీలు జరపడానికి అనుసరించాల్సిన, చేయకూడని వాటి గురించి తెలియజేస్తుంటుంది.

ట్విట్టర్ అధికారిక అక్కౌంట్ తో ఆర్‌బిఐకి 'ఆర్‌బిఐ సేస్' అనే మరో ట్విట్టర్ ఖాతా కూడా ఉంది. దీనికి సంబంధించి బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ ఆదివారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా "అవగాహన పెంచుకోవడానికి పైసా ఖర్చు కాదు కానీ అజ్ఞానానికి మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది‘ అని పోస్ట్‌ చేశారు.

ఆర్‌బి‌ఐ సంవత్సరం పైగా నుండి  ఇంగ్లీష్, హిందీలలోనే కాకుండా వివిధ ప్రాంతీయ భాషలలోనూ  ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఏప్రిల్ ప్రారంభంలో ఫేస్ బుక్ పేజీని కూడా ప్రారంభించింది.

also read ప్రముఖ ఆర్థికవేత్త, పద్మ భూషణ్ డాక్టర్ ఇషర్ జడ్జి అహ్లువాలియా మృతి.. ...

కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో దేశంలో విధించిన లాక్ డౌన్ కస్టమర్లు సురక్షితంగా ఉండాలని ప్రజలకు సలహా ఇచ్చే భద్రతా ప్రచారాన్ని కూడా ఆర్‌బి‌ఐ ప్రారంభించింది. లాక్ డౌన్ కాలంలో అమితాబ్  బచ్చన్ డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహిస్తూ, ప్రజలు డిజిటల్ చెల్లింపును స్వీకరించాలని, సురక్షితంగా ఉండాలని కోరారు.

ట్విట్టర్‌ ఫాలోవర్లలో  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ను కూడా అధిగమించి, అత్యంత ప్రాచుర్యంలో ఉన్న సెంట్రల్‌ బ్యాంక్‌గా ఆర్‌బీఐ నిల్చింది.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుఎస్ ఫెడరల్ రిజర్వ్‌ కి 6.64 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, ఆర్‌బిఐ ట్విట్టర్ అక్కౌంట్ కి  9.66 లక్షల మంది ఫాలోవర్లు  ఉన్నారు. ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ 5.81 లక్షల మంది ఫాలోవర్లు  ఉన్నారు.