RBI Repo Rate: వరుసగా 4వ సారి రెపో రేటులో మార్పుల్లేవు, EMI తగ్గుతుందని ఆశించిన వారికి పెద్ద నిరాశ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా నాలుగోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. అంటే గృహ రుణం, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక రుణ రేటు (రెపో రేటు)ని వరుసగా నాలుగోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) సమావేశంలో ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అంటే గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు సహా బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు కూడా మారకుండా ఉండే అవకాశం ఉంది. దీంతో రెపో రేటు తగ్గుతుందని, రుణాల ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన రుణగ్రహీతలకు మళ్లీ నిరాశే ఎదురైంది.
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ, మొత్తం ద్రవ్యోల్బణం దృక్పథం అనిశ్చితితో నిండి ఉందని, బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉందని అన్నారు. "పప్పుధాన్యాలు, నూనె గింజలు వంటి కొన్ని కీలక పంటల ఖరీఫ్ విత్తనం తగ్గడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం అంచనాలు అనిశ్చితితో నిండి ఉన్నాయన్నారు. తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, ప్రపంచ ఆహార, ఇంధన ధరలలో అస్థిరత కూడా దోహదపడుతున్నాయి" అని శక్తికాంత దాస్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది 5.4 శాతంగా ఉండవచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇది 5.2కి తగ్గవచ్చని పేర్కొంది.