Asianet News TeluguAsianet News Telugu

రెపో రేటులో నో చేంజ్; 6.5% వద్ద కొనసాగిస్తూ RBI ఎంపిసి ప్రకటన..

  భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ నేడు కీలక వడ్డీ రేట్లపై ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని ప్రకటించారు. RBI MPC రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు, దింతో ఎప్పటిలాగే  6.5% వద్ద ఉంచబడింది.
 

RBI MPC Meeting: No change in repo rate; Kept unchanged at 6.5%, RBI MPC took the decision-sak
Author
First Published Apr 5, 2024, 11:25 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు కీలక వడ్డీ రేట్లపై ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని ప్రకటించారు. RBI MPC వడ్డీ రేట్లలో అంటే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. దింతో  6.5% వద్ద ఎటువంటి మార్పు లేకుండా ఉంచబడింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25) ఇది మొదటి RBI MPC ప్రకటన. గత ఆరు వరుస MPC సమావేశాలలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును యథాతథంగా ఉంచింది. ఏడో సమావేశంలో కూడా రెపో రేటును 6.5 శాతంగా మాత్రమే ఉంచారు. ఆర్‌బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం ఏప్రిల్ 3న ప్రారంభమైంది.

ద్రవ్యోల్బణం పెరుగుదలపై సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక: ఆర్‌బిఐ గవర్నర్
ఆహార ధరల్లో అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆర్‌బీఐ అప్రమత్తంగానే ఉంది. MSF రేటు 6.75% వద్ద నిర్వహించబడింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ఆరుగురిలో ఐదుగురు ఎంపీసీ సభ్యులు రెపో రేటును యథాతథంగా కొనసాగించేందుకు అనుకూలంగా ఉన్నారని తెలిపారు.

ఆర్థిక సంవత్సరం 25లో జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ బలపడుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు. ప్రైవేట్ వినియోగం కూడా పెరుగుతుందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.8% నుంచి 6.9%కి పెంచినట్లు ఆయన చెప్పారు.

GDP వృద్ధిపై RBI అంచనా ఏమిటి?
FY25 మొదటి త్రైమాసికంలో GDP వృద్ధి 7.2% నుండి 7.1%కి తగ్గుతుందని అంచనా    
FY25 రెండవ త్రైమాసికానికి GDP వృద్ధి అంచనా 6.8% నుండి 6.9%కి     
FY25 మూడవ త్రైమాసికానికి GDP వృద్ధి అంచనా 7%    
Q4FY25   GDP వృద్ధి అంచనా 6.9% నుండి 7%కి పెరిగింది

ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ గవర్నర్‌  అంచనా ?
FY25 CPI అంటే రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 4.5% వద్ద ఉంది
Q4FY25  CPI అంచనా 4.7% నుండి 4.5%కి తగ్గింది 
Q1FY25 CPI అంచనా 5% నుండి 4.9%కి  
Q2FY25   CPI అంచనా 4% నుండి 3.8%కి తగ్గింది

Follow Us:
Download App:
  • android
  • ios