రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ రెపోను 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ రేటు 4.40 శాతానికి పెరిగింది. RBI చివరిసారిగా కీలక వడ్డీ రేట్లను 22 మే 2020న మార్చింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటనతో సెన్సెక్స్‌ భారీగా పతనమైంది. నిర్ణయం వెలువడిన వెంటనే సెన్సెక్స్ 1100 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది. 

RBI Hike Repo Rate: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) పాలసీ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో షెడ్యూల్ ఖరారు చేయని దవ్య పరపతి విధాన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం అతి పెద్ద ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, బెంచ్‌మార్క్ వడ్డీ రేటును 40 bps పాయింట్లు పెంచింది. దీంతో రెపోరేటు 4.40 శాతానికి పెరిగింది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచకముందే ఆర్బీఐ ఈ అనూహ్య చర్య తీసుకుంది. ఇది కాకుండా, దేశంలో పెరుగుతున్న రిటైల్ ద్రవ్యోల్బణం కూడా RBI ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే CRR లేదా నగదు రిజర్వ్ నిష్పత్తి, (బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్‌లకు సంబంధించి రిజర్వ్‌లలో ఉంచాల్సిన నగదు శాతం) 0.50 శాతం పెరిగింది. దీంతో ఈ నిష్పత్తి 4.5 శాతానికి పెరిగింది. అంతకుముందు, RBI చివరిసారిగా కీలక వడ్డీ రేట్లను 22 మే 2020న మార్చింది. ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటనతో సెన్సెక్స్‌ భారీగా పతనమైంది. నిర్ణయం వెలువడిన వెంటనే సెన్సెక్స్ 1100 పాయింట్ల పతనాన్ని నమోదు చేసింది.

రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ మే 2, 4 తేదీల్లో ఆఫ్-సైకిల్ సమావేశాన్ని నిర్వహించింది. రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచేందుకు సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఓటు వేసిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణం నియంత్రణపై ఆర్‌బీఐ గవర్నర్‌ దృష్టి సారించారు. ద్రవ్యోల్బణం నుంచి భారతదేశం కోలుకోవడానికి సవాలుగా మారుతున్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే అటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి US ఫెడరల్ రిజర్వ్ సైతం కీలక వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రెపో రేటు అంటే ఏంటి?
ఆర్‌బీఐ వద్ద నుంచి బ్యాంకులు రుణాలు తీసుకుంటాయి. అలా బ్యాంకులు నుంచి ఆర్‌బీఐ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. దీనిని స్వల్పకాలిక వడ్డీ రేటు అని సైతం పిలుస్తుంటారు. అయితే ఈ రెపోరేటును సమాకాలీన దేశ ఆర్థిక పరిస్థితిన బట్టి నిర్ణయిస్తుటారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెపో రేటును నిర్ణయిస్తారు. రెపో రేటును తగ్గిస్తే బ్యాంకుల నుంచి వినియోగ దారులకు త‌క్కువ‌ వడ్డీ రేటుకే వాహన, వాణిజ్య, గృహ రుణాలు లభిస్తాయి. సామాన్యంగా చాలా బ్యాంకులు రెపో రేటు తగ్గించిన సమయంలో, సామాన్యుల‌కు తక్కువ రేటుకే రుణాలను అందిస్తుంటాయి. 

రివర్స్ రెపో రేటు అంటే ఏంటి ?
బ్యాంకులు తమ డబ్బును రిజర్వ్ బ్యాంకులో దాచుకుంటాయి. ఇలా బ్యాంకుల నుంచి ఆర్బీఐ చేరే డబ్బును రుణంగా భావిస్తుంది. ఆర్‌బీఐలో బ్యాంకులు నిల్వ చేసుకునే నిధులపై పొందే ఆర్బీఐ వడ్డీచెల్లిస్తుంది, ఈ వడ్డీ రేటును రివర్స్‌ రెపో రేటుగా పిలుస్తారు. సాధారణంగా ఇది రెపో రేటు క‌న్నా తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం కోసం బ్యాంకులు తమ డబ్బును ఆర్‌బీఐలో నిల్వ ఉంచుతాయి. తద్వారా స్థిర‌ వడ్డీ ఆదాయాన్ని పొందే వీలుంటుంది.