ఇప్పటికే ఏటీఎం ఛార్జీలు, నగదు విత్ డ్రా, నగదు జమ తదితర వ్యవహారాలతో వినియోగదారుల జేబులు గుళ్ల చేస్తున్నాయి బ్యాంకులు. ఇలాంటి సమయంలో జనానికి ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది రిజర్వ్ బ్యాంక్.

నగదు ఉపసంహరణ ఛార్జీలు తగ్గించేందుకు త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు గురువారం ప్రకటన చేసింది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్భంగా అత్యున్నత బ్యాంక్ ఈ సంకేతాలిచ్చింది.

నెఫ్ట్, ఆర్టీజీఎస్‌ల ద్వారా చేపట్టే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్‌లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం ఛార్జీల విషయంలో కూడా బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్లే.

ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించని రిజర్వ్ బ్యాంక్.. ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని... కావున ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలని నిర్ణయించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ అధికారులు తెలిపారు.