Asianet News TeluguAsianet News Telugu

ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిలైతే నో ఛార్జ్: బ్యాంకులకు ఆర్‌బీఐ హుకుం

కొన్ని సార్లు లావాదేవీలు విఫలమైనా దాన్ని లావాదేవీగానే పరిగణించి బ్యాంకులు చార్జీలు విధిస్తుండేవి. తాజాగా ఈ తరహా లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతాదారులపై ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులతో పాటు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. 

RBI clarifies on free ATM transactions
Author
New Delhi, First Published Sep 1, 2019, 12:12 PM IST

పరిమితి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించిన ఖాతాదారులపై బ్యాంకులు చార్జీలు విధిస్తుంటాయి. కొన్ని సార్లు లావాదేవీలు విఫలమైనా దాన్ని లావాదేవీగానే పరిగణించి బ్యాంకులు చార్జీలు విధిస్తుండేవి.

తాజాగా ఈ తరహా లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతాదారులపై ఎలాంటి చార్జీలు విధించారాదని బ్యాంకులకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు స్థానిక గ్రామీణ బ్యాంకులతో పాటు అన్ని రకాల వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తాయి. 

వినియోగదారుడు ఏటీఎంను ఉపయోగిస్తున్నప్పుడు యంత్రంలోని హార్డ్‌వేర్‌ విఫలమైలావాదేవీ నిలిచిపోతే.. దాన్ని లావాదేవీగా పరిగణించరాదు. ఏటీఎం సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా సమస్య తలెత్తడంతో లావాదేవీ విఫలమైనా దానికి ఎలాంటి చార్జీ విధించరాదు.
 
కొన్నిసార్లు సమాచార వైఫల్యం వల్ల నిలిచిపోయే లావాదేవీలనూ లావాదేవీ జరిగినట్లు పరిగణించరాదు. వినియోగదారుడు కోరిన మేరకు ఏటీఎం కరెన్సీ నోట్లను అందించకపోతే.. లావాదేవీ వైఫల్యంగా పరిగణించాల్సిందే. దానికి ఎటువంటి చార్జీని విధించరాదు.

వినియోగదారుడు ఏటీఎం పిన్‌ను తప్పుగా ఇచ్చినా కూడా లావాదేవీగా పరిగణించరాదు. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను యాక్టివేట్‌ చేసేందుకు ఒక్కోసారి ఏటీఎంల ద్వారా తొలి లావాదేవీ జరుపాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి చార్జీని విధించరాదు.
 
ఖాతాదారుడు తన ఖాతాలో బ్యాలెన్స్ పరిశీలించుకునేందుకు ఏటీఎం వాడితే ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదు. ఆ సేవలను ఖాతాదారులకు పూర్తిగా ఉచితంగా అందించాలి. ఏటీఎం ద్వారా కొత్త చెక్‌ బుక్‌ కోసం ఖాతాదారుడు చేసే విజ్ఞప్తిని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి.
 
ఏటీఎం ద్వారా ఖాతాదారుడు తన పన్నులను చెల్లించినా ఉచితంగానే పరిగణించాలి. ఖాతాదారుడు తన ఖాతాలో ఉన్న మొత్తాన్ని వేరే అకౌంట్‌లోకి పంపేందుకు వినియోగదారుడు ఏటీఎంను వినియోగిస్తే.. దాన్ని ఉచిత లావాదేవీగానే పరిగణించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios