Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టరులో ఆర్‌బీఐ రికార్డు.. ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకుగా అవతరణ..

ఆర్‌బిఐ ట్విట్టర్ ఖాతా ఈ రోజు 10 లక్షల మంది ఫాలోవర్స్ మార్క్ చేరుకుంది. ఈ కొత్త మైలురాయి ఆర్‌బిఐలో నా సహోద్యోగులందరికీ అభినందనలు ”అని శక్తికాంత దాస్ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
 

RBI becomes first central bank with 1 million Twitter followers in india
Author
Hyderabad, First Published Nov 23, 2020, 3:32 PM IST

 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఒక బిలియన్ అంటే 10 లక్షలకు పైగా ట్విట్టర్ ఫాలోవర్లను సాధించి ప్రపంచంలోనే మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకుగా అవతరించింది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆర్‌బిఐలోని నా సహోద్యోగులందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

"ఆర్‌బిఐ ట్విట్టర్ ఖాతా ఈ రోజు 10 లక్షల మంది ఫాలోవర్స్ మార్క్ చేరుకుంది. ఈ కొత్త మైలురాయి ఆర్‌బిఐలో నా సహోద్యోగులందరికీ అభినందనలు ”అని శక్తికాంత దాస్ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఆదివారం నాటికి ఆర్‌బిఐ ట్విట్టర్  అక్కౌంట్ ని ప్రపంచవ్యాప్తంగా 10లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు, ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన సెంట్రల్ బ్యాంకులలో ఒకటిగా నిలిచింది. యు.ఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కంటే ఆర్‌బిఐకి ఇప్పుడు ఎక్కువ మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు.

85 ఏళ్ల సెంట్రల్ బ్యాంక్ ట్విట్టర్‌లోకి కాస్త ఆలస్యంగా ప్రవేశించినప్పటికి ఆర్‌బిఐ సాధించిన ఈ ఘనత ప్రశంసనీయం. యు.ఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) ట్విట్టర్ అక్కౌంట్స్ తరువాత జనవరి 2012లో ట్విట్టర్ ఖాతా సృష్టించింది.

also read స్టాక్ మార్కెట్ బౌన్స్, సెన్సెక్స్ 350 పాయింట్లు పెరుగుదలతో అన్ని రంగాలు విజృంభణ ...

ట్విట్టర్ లో రెండవ స్థానంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ బాంకో డి మెక్సికో లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మెక్సికో ఉంది. దీనికి 7.74 లక్షల మంది ఫాలోవర్స్ ఉండగా, బ్యాంక్ ఆఫ్ ఇండోనేషియాకు 7.57 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ప్రపంచంలోని ప్రముఖ సెంట్రల్ బ్యాంక్ అయిన యుఎస్ ఫెడరల్ రిజర్వ్‌కి కేవలం 6.77 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచంలో రెండవ అత్యంత శక్తివంతమైన ద్రవ్య అధికారం ఇసిబికి ట్విట్టర్ లో  5.91 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇసిబి తరువాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ కి 3.82 లక్షల  ఫాలోవర్స్,  తరువాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 3.17 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తరువాత బ్యాంక్ ఆఫ్ కెనడా 1.80 లక్షల ఫాలోవర్స్ తో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ 1.16 లక్షల మంది ఫాలోవర్స్ తో ఉంది.

ఆర్‌బి‌ఐ ట్విట్టర్ ప్రజాదరణ 2019 మార్చి నుండి కేవలం 3.42 లక్షల మంది ఫాలోవర్స్ సాధించింది. మార్చి 2020 నాటికి, దాని ఫాలోవర్స్ సంఖ్య 7,50,00 కు పెరిగింది, మార్చి 25, 2020 నుండి ఫాలోవర్స్ 1.5 లక్షలు పెరిగాయని ఒక అధికారిక ఒక  వార్తా సంస్థ ధృవీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios