టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాను దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక పారిశ్రామికవేత్తలలోని ఒకరిగా పరిగణిస్తారు. టాటా గ్రూప్ కార్ల వ్యాపారాన్ని రతన్ టాటా ప్రారంభించారు. టాటా మోటార్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

రతన్ టాటా 1998లో కార్ల వ్యాపారాన్ని ప్రారంభించి, మొదటి ప్యాసింజర్ కారు టాటా ఇండికాను నిర్మించారు.

టాటా ఇండికా కారుని ఒక భారతీయ సంస్థ రూపొందించిన దేశంలోని మొట్టమొదటి కారు. రతన్ టాటా టాటా ఇండికా కారు గురించి ప్రారంభంలో చాలా ఉత్సాహంగా ఉండేవాడు కాని అతని ఉత్సాహం ఒక సంవత్సరం తరువాత మాయమైంది.

వాస్తవానికి, టాటా ఇండికా సేల్స్ చాలా నిరాశపరిచాయి దీంతో సంస్థ నష్టాల్లోకి వెళ్లింది. ఆ తరువాత 1999లో రతన్ టాటా తన కార్ల వ్యాపారాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నాడు.

అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ టాటా మోటార్స్ కార్ల వ్యాపారాన్ని కొనడానికి ఆసక్తి చూపించింది. ఈ ఒప్పందం కోసం ఫోర్డ్ మోటార్స్ ప్రధాన కార్యాలయం ఉన్న డెట్రాయిట్కు కి రతన్ టాటా అతని బృందాన్ని పిలిపించారు.

రతన్ టాటా అతని బృందం ఫోర్డ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్‌లతో సుమారు 3 గంటలు సమావేశమయ్యారు, అయితే ఈ సమయంలో ఫోర్డ్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్‌ల ప్రవర్తన కాస్త దుర్వినియోగంగా ఉంది.

also read  అనిల్ అంబానీ భార్య టీనా లగ్జరీ లైఫ్ స్టయిల్.. చూస్తే వావ్ అనాల్సిందే.. ...

ఫోర్డ్ అధికారులు రతన్ టాటాతో 'మీకు ఏమీ తెలియదు, అలాంటప్పుడు మీరు ఎందుకు కార్లు తయారు చేయడం ప్రారంభించారు.. ? ఈ మాటలు వినడంతో  రతన్ టాటా అవమానంతో చాలా బాధపడ్డాడు దీంతో అతను ఈ ఒప్పందాన్ని రద్దు చేశాడు. రతన్ టాటా అతని బృందం అదే రోజు సాయంత్రం డెట్రాయిట్ నుండి న్యూయార్క్ తిరిగి వచ్చారు.

ఫోర్డ్‌ మోటార్స్ టీంతో వ్యవహరించడానికి వెళ్లిన జట్టులో ఉన్న టాటా ఉన్నతాధికారి ప్రవీణ్ కడాలే ఈ స్టోరీని పంచుకున్నారు. డెట్రాయిట్ నుండి న్యూయార్క్ తిరిగి వచ్చినప్పుడు రతన్ టాటా చాలా నిరాశ చెందారని ప్రవీణ్ కడాలే చెప్పారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన రతన్ టాటా మరోసారి టాటా మోటార్స్ కార్ల విభాగంపై దృష్టి పెట్టారు. కాలక్రమేణా రతన్ టాటా కృషి, అంకితభావం ఫలించింది. దీంతో టాటా మోటార్స్ విజయవంతమైన సంస్థగా మారింది.

2008లో టాటా మోటార్స్ కారు అత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించింది. ఇంతలో ఫోర్డ్ మోటార్స్ 2008 ఆర్ధిక మాంద్యం నుండి చాలా నష్టపోయింది.

ఆ సమయంలో ఫోర్డ్ మోటార్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, దాని జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రాండ్లను విక్రయించాలని నిర్ణయించుకుంది. రతన్ టాటా అప్పుడు ఈ రెండు ఫోర్డ్ బ్రాండ్లను కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఒప్పందం కోసం ఫోర్డ్ యజమాని, అతని బృందం ఈ రెండు బ్రాండ్లను విక్రయించడానికి ముంబైకి వచ్చారు.

ఈ సమావేశంలో ఫోర్డ్ మోటార్స్ యజమాని బిల్ ఫోర్డ్ రతన్ టాటాతో మాట్లాడుతూ 'మీరు జాగ్వార్ ల్యాండ్ రోవర్లను కొనుగోలు చేయడం ద్వారా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు' అని అన్నారు.  రతన్ టాటా బిల్ ఫోర్డ్‌తో ఏమీ అనలేదు, ఈ విధంగా రతన్ టాటా తన అవమానాలకు ప్రతీకారం అలాంటిది ఏమి పెట్టుకుకోకుండా సమాధానం ఇచ్చాడు.