Ratan Tata: రతన్ టాటా బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి పొరుగు దేశం చైనా కారణం అని మీకు తెలుసా..? ఎలాగంటే..?

ఆగర్భ శ్రీమంతుడైన రతన్ టాటా బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి  పొరుగు దేశం చైనా  కారణం అంటే ఆశ్చర్యం కలగక మానదు.  అసలు చైనాకి రతన్ టాటా  వివాహానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. 

Ratan Tata: Did you know that neighboring country China is the reason why Ratan Tata remains a bachelor MKA

నేడు ఉప్పు నుంచి ఎగిరే విమానాల వరకు విస్తరించిన టాటా సామ్రాజ్యం వెనుక వెన్నెముకగా నిలిచిన వ్యక్తి రతన్ టాటా.  సుమారు  రెండు శతాబ్దాలుగా టాటా సామ్రాజ్యం భారత  ఆర్థిక వ్యవస్థలో వెన్నుదన్నుగా  నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఇంతటి ఘన కీర్తి వహించిన టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన రతన్ టాటా మాత్రం తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేయడం ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తుంది. 

రతన్ టాటాను టాటా గ్రూపును చాలా ఎత్తుకు తీసుకెళ్లారు, కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.  నిజానికి ఆయన తన జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకోలేదు.  కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన బ్రహ్మచారిగా మిగిలి పోవాల్సి వచ్చింది. . అందులో ఒక కారణం భారత చైనా యుద్ధం అది ఎలాగో తెలుసుకుందాం. 

గతంలో రతన్ టాటా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా తన ప్రేమ జీవితం గురించి తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు. ఆయన ఎలా ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ కథ ఎందుకు అసంపూర్ణంగా మిగిలిపోయింది వంటి విషయాలు  పంచుకున్నారు. 

భారత్-చైనా యుద్ధం కారణంగా తన వివాహం వాయిదా పడిందని రతన్ టాటా తెలపడం గమనార్హం. తన లవ్ స్టోరీకి సంబంధించి.. ఆయన చెబుతూ తాను  లాస్ ఏంజెల్స్ లో చదువుతున్న సమయంలో ఓ అమెరికన్ అమ్మాయిని ప్రేమించానని తెలిపారు. వారి ప్రేమ రెండేళ్లుగా కొనసాగింది, ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.  వివాహం చేసుకోవాలని నిర్ణయించారు, కానీ అకస్మాత్తుగా రతన్ టాటా తల్లి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతను అకస్మాత్తుగా భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.

రతన్ టాటా, అతని స్నేహితురాలు భారతదేశంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే 1962వ సంవత్సరంలో అకస్మాత్తుగా భారత్-చైనా మధ్య యుద్ధం జరిగిందని రతన్ టాటా చెప్పారు. యుద్ధం నేపథ్యంలో  ఆయన ప్రియురాలి  కుటుంబం  ఆమెను భారతదేశానికి పంపడానికి నిరాకరించింది. భారతదేశం, చైనా మధ్య ఈ యుద్ధం కారణంగా, వారి ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది.

ఆ తర్వాత రతన్ టాటా బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయారు. వ్యాపారాన్ని విస్తరించే బాధ్యత అతని భుజాలపై వేసుకున్నారు. పనికి, ప్రయాణానికి మధ్య అన్నీ మర్చిపోయారు. ఆ తర్వాత కూడా వీరి జీవితంలో ప్రేమ మొదలైంది కానీ కొన్ని కారణాల వల్ల అది పెళ్లికి దారితీయలేదు.

గతంలొ సిమి గేర్వాల్ షోలో రతన్ టాటా మాట్లాడుతూ తన జీవితంలో కొన్నిసార్లు ఒంటరితనంగా అనిపిస్తుంది. ఎవరితోనైనా ఉంటే ఎలా ఉంటుంది అనిపిస్తుందని అన్నారు. కానీ ఒంటరి జీవితం వల్ల తాను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేద. నిరంతరంగా పనిపై ఎక్కువ దృష్టి పెట్టగలిగాను అని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios