Asianet News TeluguAsianet News Telugu

కన్ఫర్మ్ టికెట్ బ్రాండ్ అంబాసిడర్ గా రానా దగ్గుబాటి, ఆన్ లైన్ ట్రైన్ టికెట్ బుకింగ్ కోసం సరికొత్త యాప్..

ఇక్సిగో గ్రూప్ యాప్, అగ్రగామి ట్రైన్ టికెట్ డిస్కవరీ అండ్ బుకింగ్ వేదిక అయిన కన్ఫర్మ్ టికెట్ తన తొలి బ్రాండ్ క్యాంపెయిన్  ట్రైన్ టికెట్ టైగర్ కోసం  ప్యాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటిని రంగంలోకి దింపింది.

Rana Daggubati as Confirm Ticket brand ambassador, new app for online train ticket booking
Author
First Published Jan 5, 2023, 9:56 PM IST

ఇక్సిగో గ్రూప్ యాప్, అగ్రగామి ట్రైన్ టికెట్ డిస్కవరీ అండ్ బుకింగ్ వేదిక అయిన కన్ఫర్మ్ టికెట్ తన తొలి బ్రాండ్ క్యాంపెయిన్  ట్రైన్ టికెట్ టైగర్ కోసం  ప్యాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటిని రంగంలోకి దింపింది.  యూజర్లకు తిరుగులేని ప్రయాణ అనుభూతిని అందించే విధంగా ఉండే కన్ఫర్మ్ టికెట్ యాప్,  దాని విస్తృత శ్రేణి ఫీచర్లకు ప్రాచుర్యం కల్పించేలా ఈ క్యాంపెయిన్ డిజైన్ చేశారు. టీవీ, రేడియో, డిజిటల్ వేదికలపై ఈ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.
 
కన్ఫర్మ్ టికెట్ ని 'ట్రైన్ టికెట్ టైగర్'గా ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో టీవీసీలలో రానా దగ్గుబాటి అద్భుతమైన కొత్త అవతారంలో కనిపించారు.  ఇది వన్-స్టాప్-షాప్  ట్రైన్  యాప్. ఇది వినూత్న సేవలతో భారతదేశంలోని  ట్రైన్  ప్రయాణికుల సాధారణ సమస్యలను పరిష్కరిస్తుంది.  రైళ్లు పూర్తిగా ముందస్తుగా బుక్ చేసుకోవడం వల్ల తాము కోరుకున్న గమ్యస్థానానికి నేరుగా  ట్రైన్  టిక్కెట్‌లను కనుగొనడంలో ప్రయాణికులు పడే కష్టాలను ఈ వీడియోలలో ఒకటి చూపిస్తుంది. రానా దగ్గుబాటి తన గ్రాండ్ ఎంట్రీ ద్వారా ‘ఆల్టర్నేట్ ఆప్షన్స్’ అందించే కన్ఫర్మ్ టికెట్ యాప్‌ను పరిచయం చేస్తారు. ఈ ఫీచర్ వినియోగదారు తమ ప్రయాణాన్ని బ్రేక్ చేయడానికి మరియు వారి బోర్డింగ్/డ్రాపింగ్ పాయింట్‌ను మార్చుకోవడానికి వారి కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ట్రైన్  యాప్ కూడా చాలా వేగంగా పని చేస్తుంది, ఉపయోగించడానికి సులభమైనదిగా ఉంటుంది. ఇది రెండవ టీవీసీలో హైలైట్ చేశారు.

నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ‘‘ఈ క్యాంపెయిన్ కోసం కన్ఫర్మ్‌ టికెట్ తో జట్టుకట్టడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ బ్రాండ్‌ను తెలుగు వ్యవస్థాపకులు ప్రారంభించినందున ఈ అనుబంధం నాకు ప్రత్యేకమైంది. ఇప్పుడు ఇది భారతదేశంలోని ప్రముఖ  ట్రైన్  బుకింగ్ యాప్‌లలో ఒకటి గా ఉంది, ఇది తెలుగువారందరికీ గర్వకారణం! కన్ఫర్మ్ టికెట్ నేడు మార్కెట్‌లో ఒక ముఖ్యమైన సంస్థగా ఉద్భవించింది, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు దీనిని ఉపయోగిస్తున్నారు. వీరి అసాధారణ వృద్ధి ప్రయాణానికి నేను ప్రతిరూపంగా ఉన్నాను’’ అని అన్నారు.
 
కన్ఫర్మ్ టికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దినేశ్ కొత్త, కన్ఫర్మ్ టికెట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ  శ్రీపద్ వైద్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, ”మా బ్రాండ్ ప్రచారం కోసం డైనమిక్ సూపర్ స్టార్ రానా దగ్గుబాటితో మా అను బంధాన్ని ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం.  ట్రైన్  ప్రయాణికులకు వారి ప్రయాణాన్ని వీలైనంతగా సాటి లేనిదిగా చేయడానికి మేం అందించే ప్రత్యేక ఫీచర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ ప్రచారం తో మా లక్ష్యం.  ప్రస్తుతం దాదాపు 2 కోట్ల మంది ప్రయాణికులు నెలవారీ ప్రాతిపదికన మా సేవలను ఉపయోగిస్తున్నారు. మేం ప్రధానంగా లక్ష్యం చేసుకున్న వారిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన వారు  కూడా ఉన్నారు. రానా పాన్-ఇండియా అభిమానుల ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా మా బ్రాండ్ ఉనికిని పెంపొందించడంలో మాకు సహాయపడుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios