ముంబై స్టాక్ మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పేరుగాంచిన వ్యాపారవేత్త రాకేష్ జున్‌జున్‌వాలా ఇప్పుడు మన మధ్య లేరు. అయినప్పటికీ ఆయన జ్జాపకాలు మాత్రం పదిలం అనే చెప్పాలి. ఐశ్వర్యరాయ్ ప్రసిద్ధ పాట కజ్రారేకు వీల్‌చైర్‌లో కూర్చుని డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హఠాత్తుగా మరణించిన ముంబై స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరుగాంచిన వ్యాపారవేత్త రాకేష్ జున్‌జున్‌వాలా, వీల్‌ఛైర్‌పై కూర్చుని ఐశ్వర్యరాయ్ ప్రసిద్ధ పాట కజ్రారేకు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ వారెన్ బఫెట్ గా పేరొందిన రాకేష్ ఝున్ ఝున్ వాలా ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా తన సాదాసీదా వ్యక్తిత్వంతో వార్తల్లో నిలిచాడు. తన కవల పిల్లలు 25 ఏళ్లు వచ్చే వరకు జీవించాలనే ఆశ పెట్టుకున్న ఆయన ఈరోజు 62 ఏళ్ల వయసులో హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
ఒక వారం క్రితం, కొత్త భారతీయ విమానయాన సంస్థ ఆకాస ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభింశారు. అయితే అది పూర్తిగా టేకాఫ్ కాకముందే రాకేష్ తన కలలన్నింటినీ మధ్యలో వదిలేసి భౌతికంగా దూరమయ్యారు. ఈ బిలియనీర్ వ్యాపారవేత్త జున్‌జున్‌వాలాను ఉదయం 6.45 గంటలకు ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
అనుభవజ్ఞుడైన స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడైన 62 ఏళ్ల రాకేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన మరణవార్త తెలియగానే ప్రధాని సహా ప్రముఖులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. బిజినెస్ సినిమాతో పాటు అనేక రంగాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న జున్‌జున్‌వాలా వీల్‌ఛైర్‌లో కూర్చుని తనదైన రీతిలో ఐశ్వర్యరాయ్ నటించిన బంటీ ఔర్ బబ్లీలోని ప్రసిద్ధ పాట కజ్రారేకు నృత్యం చేయడం ఆయన అభిరుచికి నిదర్శనం.
అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ నటించిన బంటీ ఔర్ బబ్లీ చిత్రంలోని పాపులర్ సాంగ్ కజ్రా రేకు ఝున్‌జున్‌వాలా వీల్‌ఛైర్‌పై కూర్చుని ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో చూపిస్తుంది. రాకేష్‌కు డయాలసిస్ చేస్తుండగా ఈ వీడియో రికార్డయింది. అయినప్పటికీ, ఏ అనారోగ్యం ఆయనను నృత్యం చేయకుండా ఆపలేదని ట్వీట్ చేశారు.
రాకేష్ ఝున్‌జున్‌వాలా ఈ లోకాన్ని విడిచిపెట్టడంతో, అతని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. కేవలం పెట్టుబడిదారుడే కాదు, ఆయన అనేక రంగాలలో దూసుకుపోయారు. ఆయన ఆప్టెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా కూడా ఉన్నాడు.
