సీనియర్ బ్యూరోక్రాట్ రాజీవ్ బన్సాల్ గురువారం ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండోసారి నియమితులయ్యారు. పర్సనల్ మినిస్ట్రీ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం అప్పులను ఎదుర్కొంటున్న జాతీయ క్యారియర్  100 శాతం వాటా అమ్మకానికి ప్రభుత్వం ప్రకటించింది.

నాగాలాండ్ కేడర్ 1988 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన బన్సాల్ ప్రస్తుతం పెట్రోలియం, నాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎయిర్ ఇండియా సిఎండిగా ఆయనని నియామకానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది.

also read రైల్వే టికెట్‌ బుకింగులపై సంచలన నిర్ణయం...రానున్న రోజుల్లో ఇక పూర్తిగా....

 
ఎయిర్ ఇండియా  విమానయాన సంస్థ హెడ్ గా తన ఏడాది పదవీకాలం పూర్తి చేసిన అశ్వని లోహాని స్థానంలో రాజీవ్ బన్సాల్   నియమించారు. ప్రతిష్టాత్మక వ్యూహాత్మక పెట్టుబడులలో భాగంగా ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటా ప్రభుత్వం జనవరి 27న ప్రాథమిక బిడ్ పత్రాన్ని జారీ చేసింది. ఇది ప్రస్తుతం 60,000 కోట్లకు పైగా అప్పులను కలిగి ఉంది.

రాజీవ్  బన్సాల్‌ను ఆగస్టు 2017లో ఎయిర్ ఇండియా తాత్కాలిక సిఎండిగా మూడు నెలలు పాటు నియమించారు. ఎయిర్ ఇండియాలో రెండేళ్ల వ్యవధి పూర్తయిన తర్వాత అశ్వని లోహానిని రైల్వే బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

 బన్సాల్ ఉన్న మూడు నెలల పదవీకాలంలో ఎయిర్ ఇండియా కోపెన్‌హాగన్‌కు విమాన సేవలను ప్రారంభించింది. అతను ఉన్న తక్కువ కాల వ్యవధిలో ఖర్చులను తగ్గించడానికి అలాగే విమానాల సమయ పనితీరును మెరుగుపరచడానికి వివిధ దశలను ప్రారంభించాడు.

also read బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు రిషి సునక్

ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ 1980-బ్యాచ్ అధికారి అయిన అశ్వని  లోహని గత ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా సిఎండిగా  రెండవసారి నియమించారు. అతను 2018 డిసెంబర్‌లో రైల్వే బోర్డు ఛైర్మన్‌గా పదవీ విరమణ చేశారు. హర్యానాకు చెందిన బన్సాల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో కూడా పనిచేశారు.  

తన కెరీర్లో 30 సంవత్సరాలుగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సిఇఆర్సి), భారీ పరిశ్రమల శాఖ జాయింట్ కార్యదర్శి, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పనులను నిర్వహించారు. .

అతను 1986 లో ఐ‌ఐ‌టి  ఢిల్లీ నుండి పట్ట  పొందారు. హైదరాబాద్ లోని ఐ‌సి‌ఎఫ్‌ఏ‌ఐ నుండి ఫైనాన్స్ డిప్లొమా, న్యూ ఢిల్లీలోని ఐ‌ఐ‌ఎఫ్‌టి నుండి అంతర్జాతీయ వ్యాపారంలో ఎగ్జిక్యూటివ్ మాస్టర్స్ చేశారు.