హైదరాబాద్, ఇండియా, 28, జనవరి 2021: ఒకరి ఆరోగ్య సమాచారాన్ని అందించే సింపుల్ డాష్‌బోర్డ్, యుఐ అండ్ యుఎక్స్ ఫీచర్లతో కూడిన స్మార్ట్ మొబైల్ హెల్త్‌కేర్ యాప్ కురల్, నేడు  2 కొత్త మొబైల్ ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఫీచర్లు కోవిడ్ -19 టీకా గురించి ప్రజల మనస్సులలో ఉన్న సందేహాలు, ప్రశ్నలకు  సమాధానం ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. ఈ కొత్త “మై వ్యాక్సిన్ అండ్  వ్యాక్సిన్ మానిటర్ ” ఫీచర్లు ఉపయోగించడానికి ఉచితం అలాగే కరోనా టీకాకు సంబంధించిన అనేక ప్రశ్నలకు, సమాధానాలను కనుగొనడంలో వినియోగదారులకు సహాయపడుతుంది.

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కురల్ యాప్  యుఎస్ ప్రధాన కార్యాలయమైన సైన్స్ ఇంక్ కు  అనుబంధ సంస్థ.  ఇది గత రెండు దశాబ్దాలుగా వందలాది ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సంచారం అందించే అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కురల్ యాప్ రూపొందించారు.

సైన్స్, ఇంక్ & కురల్ యాప్ వ్యవస్థాపకుడు, సిఇఒ రఘు వీర్  మాట్లాడుతూ “మై వ్యాక్సిన్’ & ‘వ్యాక్సిన్ మానిటర్” మా  సొంత టెక్నాలజి  ఉపయోగించి నిర్మించబడింది. టీకాల ఉత్పత్తి సామర్థ్యం, ​​డోసెజ్ సంఖ్య వంటి భారత ప్రభుత్వం నిర్ణయించిన జనాభా విభాగాల ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకొని   కురల్  మై వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది.

also read కోవిడ్ -19 అఫెక్ట్ : బడ్జెట్ 2021పై పెరిగిపోతున్న అంచనాలు.. ఈ సారి ఆరోగ్య సంరక్షణకే అధిక ప్రాధాన్యత....

అతడు లేదా ఆమె టీకాలు ఎప్పుడు పొందుతారు, టీకా మానిటర్, వారి మొదటి ఇంకా రెండవ వ్యాక్సిన్ మోతాదులను తీసుకున్న తర్వాత టీకా దుష్ప్రభావాలను ట్రాక్ చేయడానికి  వినియోగదారులకు సహాయపడుతుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు వారి టీకాల గురించి తెలుసుకోవడానికి హెచ్చరికలు, రిమైండర్‌లను కూడా పంపుతుంది. 

 “మేము విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనలు చేశాము అలాగే భారత ప్రభుత్వం నుండి ప్రస్తుత మార్గదర్శకాల ఆధారంగా ఒక అల్గోరిథంను రూపొందించాము, భవిష్యత్తులో రేగులేటర్ రూల్స్ మార్చినప్పటికీ, అందుకు దానిని అనుకూలంగా మార్చాము.

అంతేకాకుండా పౌరులకు సహాయపడటానికి, టీకాల గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాల ద్వారా మేము నమూనాను మార్చవచ్చు. ” అని అన్నారు.

ఇంతకుముందు ప్రారంభించిన సైన్స్ హెల్త్ టెక్  కురల్ యాప్ కి  సబ్ స్క్రిప్షన్ ఉచితం.  రోగులు, వైద్యులు, ఫార్మసీలు, ల్యాబ్‌లు ఒకరికి  ఒకరు  సామాజిక దూరం పాటించడానికి సహాయపడే  ఆరోగ్య సంరక్షణ మొబైల్ యాప్. ఇది ఇంటిగ్రేటెడ్ మొబైల్ ఈ‌ఎం‌ఆర్ సోల్యూషన్ తో కూడిన యాప్, ఇది రోగుల చార్టులను నిర్వహించడానికి, రోగి సంరక్షణను డాక్యుమెంట్ చేయడానికి వైద్యులను ఉపయోగపడుతుంది.

ఈ ఆరోగ్య సంరక్షణ యాప్  ఒక సభ్యుల మధ్య  నుండి మరొక సభ్యులా మధ్య సమాచారం సులభంగ, సులువుగా, అతుకులు లేకుండా  అందిస్తుంది. యాప్ స్టోర్ నుండి దీనిని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వైద్యులతో వీడియో కాల్స్,  ల్యాబ్ అపాయింట్మెంట్ బుకింగ్, మెడిసిన్స్  హోమ్ డెలివరీ కూడా సులభతరం చేస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఐ‌ఓ‌ఎస్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. మరింత తెలుసుకోవడానికి https://www.qural.in/ క్లిక్ చేయండి.

సైన్స్ హెల్త్ టెక్  గురించి: హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సైన్స్ హెల్త్ టెక్, అమెరికాలోని అట్లాంటాలో ఉన్న సైన్స్ ఇంక్ యొక్క అనుబంధ సంస్థ. క్లినికల్ డాక్యుమెంటేషన్, సిడిఐ, మెడికల్ ఇమేజింగ్, క్లినికల్ రిపోర్టింగ్, స్పీచ్ రికగ్నిషన్ ఇంకా సంబంధిత పరిష్కారాలతో సహా అత్యాధునిక పరిష్కారాలను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణాధికారులకు సహాయం చేస్తుంది. సైన్స్ రెండు దశాబ్దాలుగా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఉంది, ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన యుఎస్ఎలో విజయవంతంగా పనిచేస్తోంది.