Asianet News TeluguAsianet News Telugu

గిరిజనులకు 24 వేల కోట్ల వరం ఇవ్వనున్న ప్రధాని.. రేపే PVTG డెవలప్‌మెంట్ మిషన్‌ ప్రారంభం..

ట్రైబల్ ప్రైడ్ డే సందర్భంగా నవంబర్ 15న పీఎం పీవీటీజీ డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి మిషన్ ఇదే మొదటిదని చెబుతున్నారు.

PVTG Prime Minister Modi will give a gift of Rs 24 thousand crores to the tribals on November 15-sak
Author
First Published Nov 14, 2023, 12:48 PM IST

జనజాతీయ గౌరవ్ దివస్ నవంబర్ 15న గిరిజనులకు 24000 కోట్ల రూపాయల బహుమతిని ఇవ్వబోతున్నారు ప్రధాని మోడీ. ట్రైబల్ ప్రైడ్ డే సందర్భంగా ప్రధాని ఈ బహుమతిని ఇస్తున్నారు. ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల (PVTGs) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి PVTG వికాస్ మిషన్‌ను 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ప్రధాని స్వయంగా ఈ PVTG మిషన్‌ను ప్రారంభించబోతున్నారు.

 ట్రైబల్ ప్రైడ్ డే సందర్భంగా నవంబర్ 15న పీఎం పీవీటీజీ డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు కూడా తెలిపాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి మిషన్ ఇదే మొదటిదని చెబుతున్నారు.  పీఎం పీవీటీజీ మొత్తం రూ.24 వేల కోట్ల పథకం. 

9 మంత్రిత్వ శాఖల నుండి 11 మందితో  మిషన్ అమలు చేయబడుతుంది. ఉదాహరణకు, PMGSY, PMGAY, జల్ జీవన్ మిషన్ మొదలైన వాటి కింద. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో, ముఖ్యంగా బలహీన గిరిజన సమూహాల (PVTGs) సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రధాన మంత్రి PVTG డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు.

 మారుమూల, దుర్గమమైన ఆవాసాలలో నివసిస్తున్న గిరిజనులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకం కింద, PVTG కుటుంబాలు , నివాస ప్రాంతాలకు రోడ్డు ఇంకా టెలికాం కనెక్టివిటీ, విద్యుత్, సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం ఇంకా పోషకాహారానికి మెరుగైన ప్రాప్యత ఉండేలా చూస్తారు. దీనితో పాటు, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అభివృద్ధి చేయబడతాయి. దీని కింద తొమ్మిది మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ పథకాలను అందించడానికి మిషన్ మోడ్‌లో పని జరుగుతుంది.

 ప్రాథమిక సౌకర్యాల కోసం
18 లక్షల జనాభా కలిగిన ఈ తెగలు 18 రాష్ట్రాల్లోని 220 జిల్లాల్లో విస్తరించి ఉన్న 22,544 గ్రామాల్లో నివసిస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో నివసించడం వల్ల స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా కనీస సౌకర్యాలు వారికి చేరలేదు. మారుమూల, దుర్గమమైన ఆవాసాలలో నివసిస్తున్న గిరిజనులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకం కింద, PVTG కుటుంబాలు ఇంకా  నివాస ప్రాంతాలకు రోడ్డు అండ్ టెలికాం కనెక్టివిటీ, విద్యుత్, సురక్షిత గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, ఆరోగ్యం,  పోషకాహారానికి మెరుగైన యాక్సెస్ ఉండేలా చూస్తారు. దీనితో పాటు, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా అభివృద్ధి చేయబడతాయి.

రిమోట్ సెటిల్‌మెంట్‌లను కవర్ చేయడానికి కొన్ని పథకాలకు సంబంధించిన ప్రమాణాలు సడలించబడతాయి. అంతే కాకుండా, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, సికిల్ సెల్ డిసీజ్ నిర్మూలన, టిబి నిర్మూలన, 100 శాతం వ్యాక్సినేషన్, పిఎం సురక్షిత్ మాతృత్వ యోజన, పిఎం మాతృ వందన్ యోజన, పిఎం న్యూట్రిషన్ అండ్  పిఎం జన్ ధన్ యోజనలకు విడివిడిగా 100 శాతం కవరేజీ అందించబడుతుంది.

 ప్రభుత్వం ప్రత్యేక దృష్టి 
మోడీ ప్రభుత్వం గిరిజన తరగతి సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, వారి ప్రత్యేక గుర్తింపును రూపొందిస్తుండటం గమనించదగ్గ విషయం. ఈ క్రమంలో గిరిజన తండాల అభివృద్ధికి, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. 2001 సంవత్సరంలో, మోడీ ప్రభుత్వం జార్ఖండ్‌లో జన్మించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన ప్రైడ్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది, అప్పటి నుండి ప్రతి సంవత్సరం గిరిజన ప్రైడ్ డే జరుపుకుంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios