Principal Partner of IPL: గుజరాత్ టైటాన్స్‌తో ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ కంపెనీ ఒప్పందం.. ఎందుకంటే..?

తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ అధికారిక జట్టు జెర్సీల మీద అథర్ ఎనర్జీ బ్రాండ్ పేరు కనిపించనుంది. అథర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 24 నగరాల్లో తన ఉనికిని చాటింది.

Principal Partner of IPL

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అథర్ ఎనర్జీ.. కొత్త ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టుతో కీలక ఒప్పందం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు తమ ప్రధాన భాగస్వామిగా అథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ కీలక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ అధికారిక జట్టు జెర్సీల మీద అథర్ ఎనర్జీ బ్రాండ్ పేరు కనిపించనుంది. అథర్ ఎనర్జీ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 24 నగరాల్లో తన ఉనికిని చాటింది.

రాబోయే 12 నెలల్లో 100కుపైగా నగరాల్లో విస్తరించాలని భావిస్తోంది. 2013లో మద్రాస్ పూర్వ విద్యార్థులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ స్థాపించిన అథర్ ఎనర్జీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ముద్రను చాటుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. 

ప్రస్తుతం, ఈ కంపెనీ భారతదేశం అంతటా 30 రిటైల్ అవుట్ లెట్లు కలిగి ఉంది. మార్చి 2023 నాటికి, 100 నగరాల్లో 150 కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. అథర్ ఎనర్జీ అత్యంత పోటీ ఉన్న ఆటోమోటివ్ రంగంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. ఐపీఎల్‌లో ఇతర జట్లకు యువ జట్టు గుజరాత్ టైటాన్స్ పోటీ ఇస్తుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. గుజరాత్ టైటాన్స్ ఈ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.

అథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. మా సంబంధిత రంగాలలో సాపేక్షంగా కొత్తవారు కావడం, నిర్భయత, సానుకూలత భాగస్వామ్య విలువలు, మా అత్యంత పోటీతత్వ వాతావరణంలో వైవిధ్యం చూపాలనే కోరికతో మాకు బంధం కలిగిస్తుందని అన్నారు. మేము మా భౌగోళిక పాదముద్రను విస్తరింపజేసేటప్పుడు, దేశవ్యాప్తంగా బ్రాండ్ పట్ల అవగాహన, పరిచయాన్ని వేగంగా పెంచడానికి IPL స్థాయి, పరిధి మాకు గొప్ప వేదికను అందిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios