భారతదేశంలో హెల్త్ కేర్, మౌలిక సదుపాయాలు, డిఫెన్స్, ఇంధనం, వ్యవసాయం, భీమా రంగాలలో పెట్టుబడులు పెట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం యు.ఎస్ కంపెనీలను ఆహ్వానించారు, ఇండియా అవకాశాలను అందిస్తుందని అన్నారు.

"ఈ రోజు భారత్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆశావాదం నెలకొంది. ఎందుకంటే భారత్‌ ఎన్నో అవకాశాలను, ఎంపికలను కల్పించడంతోపాటు  ఆహ్వానిస్తోంది’’ అని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ను ఉద్దేశించి మోడీ అన్నారు.

గత ఆరు సంవత్సరాలలో ఎన్నో సంస్కరణలు చేపట్టడంతోపాటు ఎన్నో రంగాల్లోకి పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం ప్రాముఖ్యతను కరోనా మహమ్మారి చూపించిందన్నారు.

also read కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త ఎం.డి & సిఇఒగా రమేష్ బాబు ...

దేశీయంగా బలమైన ఆర్థిక సామర్థ్యాలతో భారత్‌ బలంగా నిలిచిందన్నారు. భారత్‌ అవకాశాల కేంద్రంగా మారుతోందంటూ ఒక ఉదాహరణను తెలియజేశారు. పట్టణ ఇంటర్నెట్ వినియోగదారుల కంటే గ్రామీణ ఇంటర్నెట్ వినియోగదారులు ఎక్కువ మంది ఉన్నారు, ”అని ఆయన అన్నారు.

"దీని అర్థం తయారీకి దేశీయ సామర్థ్యం, ​​ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించడం, అంతర్జాతీయ వాణిజ్యం వైవిధ్యత" అని ఆయన చెప్పారు.