జూలై 28న రైతులకు గుడ్ న్యూస్ వినిపించనున్న ప్రధాని మోదీ...పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసే చాన్స్..
పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాలకు ఏడాదికి 3 వాయిదాల్లో రూ.6000 డీబీటీ పద్ధతి ద్వారా బదిలీ చేస్తున్నారు. అయితే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్‌లో తప్పులుంటే డబ్బులు పొందేందుకు అవకాశం ఉండదు.
మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్) పథకం కింద 14వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ నెల 28న గుడ్ న్యూస్ వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దాదాపు 10 కోట్ల మంది రైతుల ఖాతాలకు 14వ విడతలో డబ్బులు నేరుగా అకౌంట్లో పడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 28న రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ నెల 28వ తేదనీ రాజస్థాన్‌లోని నాగౌర్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ బహిరంగ సభలో, పీఎం కిసాన్ కింద 14వ విడత డబ్బులను రైతుల అకౌంట్లలో వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకు ముందు 2023 ఫిబ్రవరిలో 13వ విడత రైతుల ఖాతాల్లో చేరింది. PM కిసాన్ కింద, కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతుల ఖాతాలకు 3 వేర్వేరు వాయిదాలలో 6000 రూపాయలను పంపుతుంది. అయితే మీ రిజిస్ట్రేషన్‌లో తప్పులుంటే రూ.2000 మీకు అందవు. అందుకే 14వ విడతకు ముందు మీ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది.
ఈ విధంగా మీరు మీ స్టేటస్ ను తనిఖీ చేయవచ్చు
>> PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి.
>> హోమ్‌పేజీలో కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్ ఎంపికపై క్లిక్ చేయండి.
>> బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
>> కొత్త పేజీని తెరవడానికి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంపికను ఎంచుకోండి.
>> క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి. జనరేట్ OTPపై క్లిక్ చేయండి.
>> దీని తర్వాత మీ స్థితి తెలుస్తుంది.
>> మీ eKYC పూర్తి కాకపోతే, సిస్టమ్ మీకు ఎలాంటి స్థితి సమాచారాన్ని అందించదు మరియు మీ KYCని నవీకరించమని మిమ్మల్ని అడగవచ్చు.
ఈ సందర్భాలలో మీకు డబ్బులు పడవు..
>> మీరు దరఖాస్తులో ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే..
>> PM కిసాన్ కింద ఏదైనా అవసరమైన పత్రం సమర్పించబడకపోతే.
>> భూమి యాజమాన్యం మీ పేరున లేకపోయినా డబ్బులు పడవు.. PM కిసాన్‌లో ఇది అవసరం.
>> మరో రైతు నుంచి భూమి తీసుకుని వ్యవసాయం చేస్తే పథకానికి అనర్హులు
>> ఒక రైతు లేదా కుటుంబంలో ఎవరైనా రాజ్యాంగ పదవిలో ఉంటే ఈ పథకానికి అనర్హులు
>> రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం, అలాగే PSUలు మరియు ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థలలో సేవలందిస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు మరియు ఉద్యోగులు. పథకానికి అనర్హులు
>> డాక్టర్లు, ఇంజనీర్లు, సీఈఓలు, ఆర్కిటెక్ట్‌లు, లాయర్లు వంటి నిపుణులు ఈ పథకానికి అనర్హులు.
>> 10,000 ప్లస్ నెలవారీ పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అనర్హులు
>> ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అనర్హులు
>> రైతు కుటుంబంలో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా.. జిల్లా పంచాయతీలో ఉన్నా.. ఈ పథకానికి అనర్హులు