PNB SO Recruitment 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషలిస్ట్ ఆఫీసర్స్(SO) 145 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
PNB SO Bharti 2022: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేయడానికి లింక్‌ను యాక్టివేట్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 7 మే 2022. నోటీసు ప్రకారం, స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుకు మొత్తం 145 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 40 రిస్క్ మేనేజర్, 100 క్రెడిట్ మేనేజర్, 5 సీనియర్ మేనేజర్ ఖాళీలు ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2022 12 జూన్ 2022న నిర్వహించబడుతుంది. దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
పే స్కేలు ఇదే...
క్రెడిట్ మేనేజర్- రూ. 48170-1740/1-49910- 1990/10-69810
రిస్క్ మేనేజర్ - రూ. 48170-1740/1-49910- 1990/10-69810
సీనియర్ మేనేజర్ ట్రెజరీ - రూ.63840-1990/5-73790- రూ.2220/2-78230
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
>> మేనేజర్ క్రెడిట్- అభ్యర్థి కనీసం 60% మార్కులతో CA/CWA/CFA లేదా ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఫైనాన్స్‌లో పూర్తి సమయం MBA లేదా ఫైనాన్స్‌లో PGDM.
>> రిస్క్ మేనేజర్- CA/CWA/CFA లేదా కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్. అలాగే ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ ఎంబీఏ.
>> సీనియర్ మేనేజర్ - CA/CWA/CFA లేదా కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్. అలాగే ఫైనాన్స్‌లో ఫుల్ టైమ్ ఎంబీఏ.
PNB SO Recruitment 2022: వయో పరిమితి
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనిష్ట వయస్సు పరిమితి 25 సంవత్సరాలు కాగా, గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు (01.01.2022 నాటికి).
PNB SO Recruitment 2022: దరఖాస్తు రుసుము
SC, ST, PWD: ఒక్కో అభ్యర్థికి రూ. 50/- (ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే) + GST వర్తిస్తుంది
మిగతా అభ్యర్థులందరూ: ఒక్కో అభ్యర్థికి రూ. 850/- + GST వర్తిస్తుంది
PNB SO Recruitment 2022: ఎంపిక విధానం
అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
