Asianet News TeluguAsianet News Telugu

PMVVY Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 వరకు పెన్షన్.. పూర్తి వివ‌రాలివే..!

కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇది సామాజిక భద్రతా పతకం. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

PMVVY Pension Scheme
Author
Hyderabad, First Published Jan 26, 2022, 11:45 AM IST

కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో ప్రధాన్ మంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. ఇది సామాజిక భద్రతా పతకం. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో చేరడం వల్ల ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బలు ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ కూడా మారుతూ ఉంటుంది. ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పథకం గడువును కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31న ముగిసిన స్కీమ్‌ గడువును మరో మూడేళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కొద్ది రోజుల క్రితం ఆమోద ముద్ర వేసింది. అంటే ఈ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి 2023 మార్చి 31 వరకు అవకాశం ఉంది. 

సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్‌లో చేరడం వల్ల క్రమం తప్పకుండా డబ్బులు పొందొచ్చు. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. నెలకు గరిష్టంగా రూ.9250 వరకు పెన్షన్ పొందొచ్చు. అంటే ఏడాదికి రూ.1.11 లక్షలు వస్తాయి. దీని కోసం మీరు రూ.15 లక్షల ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కనీసం రూ.1000 నుంచి పెన్షన్ తీసుకోవచ్చు. దీని కోసం మీరు రూ.1.6 లక్షలు డిపాజిట్ చేయాలి. పాలసీ ప‌రిమితి పదేళ్లు. మీరు కనీసం కచ్చితంగా 8 శాతం రాబడిని పొందొచ్చు.

ఈ స్కీమ్‌లో చేరిన వారికి నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 కనీస పెన్షన్ లభిస్తుంది. గరిష్ట పెన్షన్ వివరాలు చూస్తే నెలకు రూ.10,000, మూడు నెలలకు రూ.30,000, ఆరు నెలలకు రూ.60,000, ఏడాదికి రూ.1,20,000 చొప్పున పొందొచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్‌కు ఫ్రీ లుక్ పీరియడ్ కూడా ఉంది. అంటే పాలసీ నచ్చకపోతే తీసుకున్న 15 రోజుల్లో వెనక్కి ఇచ్చేయొచ్చు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.  ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ సదుపాయం కూడా ఉంది. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98% మాత్రమే వెనక్కి వస్తుంది. . ఒకవేళ 10 ఏళ్లు పూర్తికాకముందే పెట్టుబడి పెట్టిన వ్యక్తి చనిపోతే పెట్టుబడి మొత్తం వారి జీవితభాగస్వామి లేదా పిల్లలు లేదా నామినీకి వస్తాయి.

మీరు ప్రతి నెలా లేదంటే మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు. మీరు స్కీమ్‌లో చేరే సమయంలో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. 60 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. లోన్ సదుపాయం కూడా ఉంది. ఇంకా ఈ స్కీమ్‌లో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే వచ్చిన వడ్డీకి మాత్రం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios