వీధి వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ది చేసుకోవడానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది పీఎం స్వీనిధి. ఈ పథకాన్ని 2020 జూన్‌ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వ్యాపారులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం PM SVANIdhi పథకాన్ని ప్రారంభించింది. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసాను అందించే 'పీఎం స్ట్రీట్‌వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి' (పిఎం స్వయానిధి) పేరుతో ఈ పథకాన్ని ప్రారంబించారు. ఈ పథకం కింద అర్హులైన వారు ఎలాంటి హామీ లేకుండా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రారంభ రుణం రూ. 10,000 వరకు లభిస్తోంది. ఈ నిధులను ఏడాదిలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది,

.రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలి..?

ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద రుణం తీసుకోవాలనుకునే వారు ప్రధానమంత్రి స్వనిధి వెబ్‌సైట్‌‌కి https://pmsvanidhi.mohua.gov.in/ వెళ్లి నేరుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లోన్‌ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. అయితే పథకం కింద రుణం పొందే వీధి వ్యాపారులు అంతకు ముందు ఎలాంటి రుణాలు పెండింగ్‌ ఉండకూడదు.

దరఖాస్తు ప్రక్రియ

- పీఎం స్వానిధి పథకం కింద రుణం తీసుకోవాలనుకునే వారు ముందుగా పీఎం స్వానిధి వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

- మీరు ఈ లింక్ ద్వారా ఆ వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు.

- అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. రూ. 10,000 లోన్, రూ. 20,000 లోన్‌తో పాటు లోన్ స్టేటస్ వంటి అనేక ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత రూ. 10,000 లేదా రూ. 20,000 రుణాన్ని ఎంచుకోండి.

- కొత్త విండో తెరుచుకుంటుంది. మీరు మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

- ఇప్పుడు మీకు OTP వస్తుంది. OTP నమోదు చేసిన తర్వాత అవసరమైన పత్రాలను అందించాలి. దీని ద్వారా దరఖాస్తు సమర్పణ ప్రక్రియను పూర్తి అవుతుంది. ఈ రుణం పొందడానికి వ్యాపారికి గుర్తింపు కార్డు అవసరం.

- ప్రారంభం, రూ. 10,000 లభిస్తాయి. దాన్ని తిరిగి చెల్లించిన వారు మాత్రమే రూ. 20,000 పొందే అవకాశం ఉంటుంది