Asianet News TeluguAsianet News Telugu

'ప్లీజ్.. క్లోజ్ చేసి కూర్చోండి': టాయిలెట్ లోపల గంటన్నరసేపు.. భయపడొద్దంటూ లేఖ..

ప్రయాణీకుడికి సహాయం చేయడానికి క్యాబిన్ సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఎయిర్‌లైన్ ఈ సంఘటనకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణీకుడికి టికెట్ ఛార్జ్ ఫుల్ రిటర్న్ అందించబడుతుందని అలాగే ప్రయాణ వ్యవధిలో సహాయం అందించబడుతుందని ఎయిర్‌లైన్ తెలిపింది.
 

Please close the lid and sit on it': What SpiceJet crew told passenger locked inside toilet for entire flight-sak
Author
First Published Jan 18, 2024, 11:28 AM IST

మంగళవారం ఉదయం ముంబై నుంచి బెంగళూరుకు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో డోర్ లాక్ పనిచేయకపోవడంతో దాదాపు గంటపాటు విమానం టాయిలెట్‌లో ఓ ప్రయాణికుడు చిక్కుకుపోయాడు. తెల్లవారుజామున 02:13 గంటలకు, ఒక ప్రయాణీకుడు టాయిలెట్‌లోకి వెళ్ళాడు, కాని ముంబై నుండి టేకాఫ్ అయిన తర్వాత సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ కావడంతో లోపలే చిక్కుకున్నాడు.

అయితే ఫ్లయిట్ క్యాబిన్ సిబ్బంది కూడా డోర్ తెరవలేకపోయారు. టాయిలెట్ డోర్ తెరవడంలో ఫెయిల్ అయిన తర్వాత, క్యాబిన్ సిబ్బంది అతనికి భయపడవద్దని కోరుతూ ఒక లెటర్ ఇచ్చారు. ఫ్లయిట్ మెయిన్ డోర్ తెరిచే వరకు టాయిలెట్‌లో కమోడ్ మూతను మూసివేసి దానిపై కూర్చోవాలని సిబ్బంది ప్రయాణికుడిని కోరారు. దింతో తెల్లవారుజామున 03:10 గంటలకు బెంగుళూరులో ల్యాండింగ్ అయ్యే వరకు ప్రయాణీకుడు టాయిలెట్‌లో వేచి ఉండాల్సి వచ్చింది, చివరికి టెక్నికల్ నిపుణులు తలుపు తెరవగలిగారు.

"సార్, మేము తలుపు తీయడానికి చాలా ప్రయత్నించాము. అయినా, మేము తెరవలేకపోయాము, భయపడవద్దు, మేము కొద్ది నిమిషాల్లో దిగుతున్నాము. కాబట్టి దయచేసి కమోడ్ మూత వేసి  దానిపై కూర్చుని మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. మెయిన్ డోర్ తెరిచాక వెంటనే ఇంజనీర్ వస్తాడు, భయపడవద్దు" అని లెటర్ లో  పేర్కొన్నారు.

Please close the lid and sit on it': What SpiceJet crew told passenger locked inside toilet for entire flight-sak

ప్రయాణీకుడికి సహాయం చేయడానికి క్యాబిన్ సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఎయిర్‌లైన్ ఈ సంఘటనకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణీకుడికి టికెట్ ఛార్జ్ ఫుల్ రిటర్న్ అందించబడుతుందని అలాగే ప్రయాణ వ్యవధిలో సహాయం అందించబడుతుందని ఎయిర్‌లైన్ తెలిపింది.

"జనవరి 16న, ముంబై నుండి బెంగళూరుకు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో దురదృష్టవశాత్తూ ఒక ప్రయాణికుడు సుమారు గంటసేపు టాయిలెట్‌లో చిక్కుకుపోయాడు, అయితే డోర్ లాక్‌లో లోపం కారణంగా విమానం గాలిలోనే ప్రయాణించింది. ప్రయాణం మొత్తం సమయంలో మా సిబ్బంది అతనికి సహాయం ఇంకా మార్గదర్శకత్వం అందించారు.” అని స్పైస్‌జెట్ తన ప్రకటనలో పేర్కొంది.

"ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి స్పైస్‌జెట్ చింతిస్తున్నాము అలాగే  క్షమాపణలు కోరుతోంది" అని విమానయాన సంస్థ తెలిపింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికుడికి తక్షణమే వైద్య సహాయం అందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios