Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా సైబరాబాద్ పోలీస్ సరికొత్త మ్యూజిక్ ఆల్బం లాంచ్

"ప్లే ఫ్రం హోం" మ్యూజిక్ ఆల్బం కోసం కేవలం 10 రోజులు మాత్రమే పట్టింది. వివిధ రకాల మ్యూజిక్ పరికరాల ద్వారా శాంతిని వ్యాప్తి చేయడానికి కార్పొరేట్ సంగీత ప్రతిభావంతుల వృత్తితోతో పాటు మ్యూజిక్ పైన వారికి ఉన్న  ఇష్టాన్ని కనబరిచారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఓల్డ్ కచేరీ రికార్డింగ్‌లు ఉన్నాయి.
 

play from home music album launched to celebrate world music day by cyberabad police and corporate bands
Author
Hyderabad, First Published Jun 22, 2020, 5:07 PM IST

హైదరాబాద్, ఇండియా, జూన్ 22, 2020: సిస్నే ఫర్ ఆర్ట్స్ “ప్లే ఫ్రం హోం- మ్యూజిక్ విత్ బ్యాండ్స్ ”  అనే మ్యూజిక్ ఆల్బం లాంచ్ చేసింది.  ఇందులో   సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు బ్యాండ్,  కాగ్నిజెంట్, రియల్ పేజ్, నోవార్టిస్, జెమోసో టెక్నాలజీస్, సేల్స్ ఫోర్స్ ఈ సంవత్సరం ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకునేందుకు ఇందులో పాల్గొన్నాయి.


"ప్లే ఫ్రం హోం" మ్యూజిక్ ఆల్బం కోసం కేవలం 10 రోజులు మాత్రమే పట్టింది. వివిధ రకాల మ్యూజిక్ పరికరాల ద్వారా శాంతిని వ్యాప్తి చేయడానికి కార్పొరేట్ సంగీత ప్రతిభావంతుల వృత్తితోతో పాటు మ్యూజిక్ పైన వారికి ఉన్న  ఇష్టాన్ని కనబరిచారు. ఈ మ్యూజిక్ ఆల్బమ్‌లో ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఓల్డ్ కచేరీ రికార్డింగ్‌లు ఉన్నాయి.

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, బేలా ఫ్లెక్, ఎడ్గార్ మేయర్, 'పైగమ్-ఎ-మొహబ్బత్ నుండి బేగం అబిదా పర్వీన్- అబిదా పర్వీన్, ముజఫర్ అలీ, కళాకారులు పుర్బయన్ ఛటర్జీ, సితార్, జిమ్మీ ఫెలిక్స్ - బాలీవుడ్ సింగర్, ఫ్లూట్ నాగరాజు, రాజేష్ వైధ్య  ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అని  ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ ఉన్నారు.


సిస్నే ఫర్ ఆర్ట్స్ #ప్లే ఫ్రం హోం ఆల్బం ధ్యేయం ఏంటంటే కార్పొరేట్ ప్రపంచానికి చేరుకోవడం, పాట ద్వారా ప్రపంచాన్నిఆరోగ్యంగా, సామాజిక ఒంటరితనాన్ని పోగొట్టేందుకు, వర్క్ ఫ్రోం హోం సమయాల్లో క్రియేటివ్ లాంచ్ కోసం వెతుకుతున్న వారికోసం, అలాగే వర్క్ ఫ్రోం హోం ఒత్తిడిని తగ్గించేందుకు, అందమైన, ప్రశాంతమైన సంగీత సృష్టించడం.

also read పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన.. ...

సైబరాబాద్ కమిషనర్ వి.సి సజ్జనార్ మాట్లాడుతూ “సంగీతం ప్రపంచాన్ని ఆరోగ్యంగా చేయగలదని సైబరాబాద్ పోలీసులు గట్టిగా నమ్ముతారు, సైబరాబాద్ పోలీస్ మ్యూజిక్ బ్యాండ్  తరుపున అందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు” అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కైలాష్ ఖేర్ మాట్లాడుతూ, “సంగీతం  శక్తిని వ్యాప్తి చేయడానికి ఒక ప్రత్యేకమైన చొరవను సైబరాబాద్ పోలీసులు, హైదరాబాద్ కార్పొరేట్ బ్యాండ్స్ నిర్వహిస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను" అని అన్నారు.

కైలాష్ ఖేర్ ఒక వీడియోపై తన నోట్‌లో "జై జై కారా (బాహుబలి పాట జై జై కారా హిందీ వెర్షన్) హైదరాబాద్ వాసియోన్ దేనా సాథ్ హమారా" (హైదరాబాద్ ప్రజలు మరింత సపోర్ట్ అందిస్తున్నారు), మానవత్వం కోసం ప్రేమను మరింతగా వ్యాప్తి చేయడానికి సంగీతకళారులను ఒక చోటుకి  తీసుకువచ్చినందుకు ఆయన అభినందించారు. 

సిస్నే ఫర్ ఆర్ట్స్ వ్యవస్థాపకుడు హరిని మధీరా మాట్లాడుతూ, "ఒక సంస్థగా మేము ఎల్లప్పుడూ సంగీతం, భారతీయ కళా రూపాల శక్తిని విశ్వసిస్తున్నాము, ముఖ్యంగా, ఒత్తిడిని అధిగమించడానికి ఇంకా ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి" అని అన్నారు. కార్పొరేట్ యుగంలో భారతీయ కళా రూపాలను చాలా విజయాలతో పరిచయం చేసాము. సామాజిక దూరం, వర్క్ ఫ్రోం హోం సమయాల్లో రొటీన్ కి భిన్నంగా ఉండటానికి కంపెనీలకు ఇటువంటివి అవసరం.

పరిశ్రమ ఏది అయినా సంగీతం పెద్ద కనెక్టర్ అని మేము భావించాము. కాబట్టి, మేము మూడు వేర్వేరు రంగాల నుండి ప్రజలను సాధారణ వేదికపైకి తీసుకురావడానికి ఈ గొప్ప  అవకాశాన్ని ఉపయోగించుకున్నము.  ఈ “ప్లే ఫ్రం హోం” ప్రయత్నం ద్వారా సిస్నే ఫర్ ఆర్ట్స్ ఎలాంటి  కష్టతర సమయాల్లో అయిన సంగీతం ద్వారా మనం ఆరోగ్యంగా, సంతోషంగా  ఉండగలము అనే  వాస్తవాన్ని బలోపేతం చేయాలనుకుంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios