Asianet News TeluguAsianet News Telugu

Two Wheeler Loans: దసరా సందర్భంగా కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, టూవీలర్ లోన్స్ వడ్డీ రేట్లు మీ కోసం

కొత్తగా టు వీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి బ్యాంకులో ఇతర NBFC సంస్థలు టూవీలర్ రుణాలను అందిస్తున్నాయి. ఏ బ్యాంకు ఎంత మేర వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయో తెలుసుకుందాం. 

Planning to buy a new bike on the occasion of Dussehra two wheeler loans interest rates are for you
Author
First Published Sep 21, 2022, 4:12 PM IST

దసరా సందర్భంగా చాలామంది వినియోగదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ముఖ్యంగా మన దేశంలో టూ వీలర్స్ కొనేందుకు ఇప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకు కారణం లేకపోలేదు టు వీలర్స్ ధర తక్కువగా ఉండటంతో పాటు ఎక్కువ దూరం అలాగే తక్కువ దూరం కూడా ప్రయాణించేందుకు ఉపయోగపడతాయి

ముఖ్యంగా మన దేశంలో టూ వీలర్స్ ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో అమ్ముడు అవుతాయి హీరో హోండా బజాజ్ వంటి సంస్థలు ప్రస్తుతం టూ వీలర్స్ రంగంలో అత్యధిక మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి

ముఖ్యంగా 2 వీలర్స్ ను సులభ వాయిదాల్లో కూడా కొనగోలు చేయవచ్చు ఎందుకు అన్ని ప్రధాన బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి ఏ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం

మీరు కొనుగోలు చేస్తున్న వాహనం రకం  మీ నెలవారీ ఆదాయాన్ని బట్టి లోన్ మొత్తం మారుతుంది. మీరు లోన్ తీసుకున్న తర్వాత, మీరు ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMIలు) ద్వారా తిరిగి చెల్లించాలి.  మీరు కూడా ఈ పండగ సీజన్‌లో ద్విచక్ర వాహనం కొనాలనుకుంటే, దాని కోసం లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, దానికి సంబంధించిన చిట్కాలను మరియు చౌకగా రుణం ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

ముందుగా మీరు ఎంత బడ్జెట్ లో బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో చెక్ చేసుకోవాలి. బడ్జెట్‌ను సెట్ చేయడానికి సరైన మార్గం ఏమిటంటే, మీరు ప్రతి నెలా ఎంత వాయిదా సులభంగా చెల్లించవచ్చో నిర్ణయించుకోండి. మీరు మీ బడ్జెట్ లేదా ఆదాయానికి అనుగుణంగా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ మొత్తానికి దరఖాస్తు చేస్తే రుణం రద్దు అవుతుంది.

మీరు ఖరీదైన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ ముఖ్యం. నెలవారీ ఆదాయం , క్రెడిట్ స్కోర్ బ్యాంక్ నిబంధనలకు సరిపోతే కొన్ని బ్యాంకులు మీకు లోన్ ఇస్తాయి. మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, బ్యాంక్ మీకు అనేక ఆఫర్‌లను అందిస్తుంది.

మీ ఆదాయం తక్కువగా ఉంటే, బ్యాంకు రుణం ఇవ్వనట్లయితే మీరు కో అప్లికెంట్ ద్వారా కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు.  మీరు దరఖాస్తు చేసేటప్పుడు ఆదాయ రుజువు, పాన్ కార్డ్, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా, 8.25%
సెంట్రల్ బ్యాంక్, 9.75%
పంజాబ్ నేషనల్ బ్యాంక్, 10.05%
కెనరా బ్యాంక్, 10.40%
బజాజ్ ఫిన్సర్వ్, 9.25% వంటి బ్యాంకులు కూడా  అతి తక్కువ ధరకే రుణాలను అందిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios