వాషింగ్టన్‌: వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్‌ను గూగుల్‌ నియమించడాన్ని సమర్థించారు. 

తాజాగా పిచాయ్‌ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్‌, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు. 

గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరన్‌ భాటియా మాట్లాడుతూ టైలర్‌ను ఇమ్మిగ్రేషన్‌ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. కొందరు ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోయామని పిచాయ్ అన్నట్లు సమాచారం. 

also read పన్నుల్లో కోత.. ‘ఐటీ’ లిమిట్స్‌పై ‘నిర్మల’ ఫోకస్

మార్క్ టేలర్ నియామకంపై పారదర్శకత పాటించే విషయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించుకునే విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని సుందర్ పిచాయ్ చెప్పారు.
 
ఈ క్రమంలో ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను, కించపరిచే అంశాలను చర్చించొద్దని ఈ వేసవిలో కంపెనీ ఓ మెమోను జారీ చేసింది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫోరమ్‌లను పర్యవేక్షిస్తామని తెలిపింది. గూగుల్‌ అధికారి బరోసో మాట్లాడుతూ ఫోరమ్‌ల కంటే సాఫ్టవేర్‌ ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు.

కంపెనీలో అసభ్య ప్రవర్తన, రహస్య సమాచారాన్ని లీక్‌ చేయడం స్పష్టమైన కంటెంట్ లేకపోవడం వంటి అంశాలను సాఫ్టవేర్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ఈ పరిణామాలపై స్పందించేందుకు గూగుల్ అధికార ప్రతినిధి గినా స్కిగ్లియానో నిరాకరించారు. 

గూగుల్ మాత్రమే ఉద్యోగుల అసమ్మతిని ఎదుర్కోవడం లేదు. ఈ నెల ప్రారంభంలో సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ ఉద్యోగులు కూడా తమతో అధినేత మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడిన ఆడియోను లీక్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయమై మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. 

also read భారతదేశం అంతటా... బిఎస్ఎన్ఎల్ ఫ్రీ కాల్స్...

ఫేస్ బుక్ ప్రత్యర్థి సంస్థ ట్విట్టర్‌దీ అదే పరిస్థితి. సెర్చింజన్ గూగుల్ మీద సిబ్బందిలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. సహచర ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఉద్యోగికి భారీ ప్యాకేజీతో నిష్క్రమణ ప్రకటించిన సంగతి తెలిశాక అత్యధిక స్థాయిలో ఉద్యోగులు గూగుల్ సంస్థను వీడారు. 

2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రయాణ నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తున్నామని, ఈ పిటిషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.