కస్టమర్‌లు మే 3వ తేదీ వరకు 24క్యారెట్ల బంగారం & వెండి కొనుగోలుపై రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వెండి నాణేలు లేదా బార్‌లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ.250 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.
భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే (PhonePe) అక్షయ తృతీయ సందర్భంగా అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో PhonePe యాప్ ద్వారా కొనుగోలు చేసే బంగారం, వెండి రెండింటిపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్‌లు యాప్ ద్వారా అత్యధిక స్వచ్ఛతగల 24క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా అన్నీ రకాల డిజైన్ ఆప్షన్స్ నుండి బంగారు నాణేలు లేదా బార్‌ల రూపంలో డెలివరీని పొందవచ్చు. ఆఫర్ వ్యవధిలో బంగారం కొనుగోలుపై అదనంగా రూ.2,500 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వెండి నాణేలు లేదా బార్‌లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ.250 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఈ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ 3 మే 2022 వరకు అందుబాటులో ఉంటుంది.
PhonePe అనేది డిజిటల్ గోల్డ్ స్పేస్‌లో అగ్రగామిగా ఉన్న రెండు MMTC PAMP & SafeGold రెండింటి నుండి అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారాన్ని అందించే ఏకైక డిజిటల్ పేమెంట్ యాప్. PhonePe అత్యధిక స్వచ్ఛత కలిగిన వెండి నాణేలు, బార్‌లను అందించడానికి సేఫ్‌గోల్డ్‌తో ప్రత్యేకంగా జతకట్టింది.
PhonePeయాప్‌లో బంగారం & వెండిని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
స్వచ్ఛతకు అత్యధిక హామీ : PhonePeలో 24క్యారెట్ల బంగారం & వెండి బెస్ట్ వాల్యు అండ్ అత్యధికంగా 99.99% స్వచ్ఛత ఉంటాయి. విస్తృతమైన డిజైన్ ఆప్షన్స్ అండ్ డినామినేషన్‌లు ఈ పండుగ సీజన్‌లో PhonePeలో బంగారం & వెండిని పర్ఫెక్ట్ ఆప్షన్ చేస్తాయి. బంగారు నాణేలను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రతి కొనుగోలుపై స్వచ్ఛత ధృవీకరణ పత్రాన్ని కూడా పొందుతారు.
సౌలభ్యం అండ్ యాక్సెసిబిలిటీ: బంగారాన్ని సంవత్సరానికి 24×7, 365 రోజులూ రూ. 1కి కొనుగోలు చేయవచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా రూపొందించిన అధిక నాణ్యత గల బంగారం & వెండి నాణేలు, బార్‌ల కోసం కస్టమర్ ఇన్షూరెన్స్ చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీని కూడా ఎంచుకోవచ్చు.
బీమా చేయబడిన బ్యాంక్ గ్రేడ్ లాకర్‌లలో స్టోరేజ్: అక్యూములేషన్ కోసం కొనుగోలు చేసిన సర్టిఫైడ్ 24K బంగారంపై సున్నా మేకింగ్ ఛార్జీలు ఉంటాయి ఇంకా ఉచిత బ్యాంక్-గ్రేడ్ గోల్డ్ లాకర్‌లలో స్టోర్ చేయబడతాయి.
19,000పైగా పిన్ కోడ్‌ల నుండి కస్టమర్‌లు ఇప్పటివరకు PhonePeలో అధిక స్వచ్ఛత కలిగిన 24K బంగారం, వెండిని పారదర్శక ధరలకు కొనుగోలు చేశారు.
బంగారాన్ని ఎలా కొనుగోలు చేయవచ్చు ఇంకా PhonePeలో అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఎలా పొందవచ్చు అంటే:
స్టెప్ 1: PhonePe హోమ్‌పేజీలో కింద ఉన్న వెల్త్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 2: తర్వాత, ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ విభాగంలో గోల్డ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్3: తర్వాత, డెలివరీ కోసం మీకు నచ్చిన నాణెం ఎంచుకోండి లేదా గోల్డ్ లాకర్‌లో పొదుపు చేయడానికి కొనుగోలు చేయడానికి "బై గోల్డ్" పై క్లిక్ చేయండి
స్టెప్4: డెలివరీ కోసం అడ్రస్ ఎంటర్ చేయడానికి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఆకుములేషన్ కోసం బంగారాన్ని కొనుగోలు చేసే సందర్భంలో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేయండి.
స్టెప్5: మీ బంగారం కొనుగోలుకు సంబంధించిన వివరాలను చెక్ చేసి, 'ప్రొసీడ్ టు పే'పై క్లిక్ చేయండి, దీంతో పూర్తయింది!
మీ బంగారు నాణెం మీ చిరునామాకు డెలివరీకి పంపబడుతుంది. మీరు లాకర్‌లో పొదుపు చేయడం కోసం బంగారాన్ని కొనుగోలు చేసినట్లయితే, మీరు త్వరలో PhonePe యాప్‌లో అప్‌డేట్ చేయబడిన గోల్డ్ బ్యాలెన్స్‌ని చూస్తారు. కొనుగోలు తర్వాత, మీరు మీ PhonePe వాలెట్‌లో క్యాష్‌బ్యాక్ ని కూడా పొందవచ్చు.
