Asianet News TeluguAsianet News Telugu

petrol diesel price today:స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. నేడు లీటరు ధర ఎంతంటే

కేంద్ర ప్రభుత్వం ఆటో ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గింపును అమలు చేసినప్పటి నుండి భారతదేశం అంతటా డిసెంబర్ 20 సోమవారం పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. ఈ సుంకం తగ్గింపుతో పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 10 తగ్గింది.

Petrol Price Today: Will have to wait for cheap petrol and diesel, know the new rates
Author
Hyderabad, First Published Dec 20, 2021, 10:57 AM IST

పెట్రోలు, డీజిల్ ధరలు మరింత తగ్గుముఖం పడతాయని ఆశించిన ప్రజలు మరికొంత కాలం వేచి చూడక తప్పదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు దిగోస్తుండటంతో  దేశంలో కూడా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే ఈరోజు డిసెంబర్ 20వ తేదీన సోమవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

IOCL సోమవారం పెట్రోల్, డీజిల్ కొత్త  ధరలను విడుదల చేసింది.  దీపావళి నుంచి ఇప్పటి వరకు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగలేదు. కొత్త ధరల ప్రకారం ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 95.41 కాగా, డీజిల్ లీటరుకు రూ. 86.67గా విక్రయిస్తున్నారు. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది.

 లక్నో పెట్రోల్ ధర రూ. 95.28, డీజిల్ ధర రూ. 86.80
గాంధీనగర్ పెట్రోల్ ధర  రూ. 95.35, డీజిల్ ధర రూ. 89.33
 పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ ధర రూ. 82.96, డీజిల్ ధర రూ. 77.13
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.108.20 డీజిల్ ధర: లీటరుకు రూ.94.62
  

ఒక నివేదిక ప్రకారం, ఐరోపాలో ఓమిక్రాన్ కరోనావైరస్ వేరియంట్ కేసులు పెరుగుతున్నందున చమురు ధరలు సోమవారం ప్రారంభంలో సుమారు 2 శాతం తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1.36 డాలర్లకు లేదా 1.9 శాతం పడిపోయి 0036 GMT నాటికి బ్యారెల్ 72.16 డాలర్లకి పడిపోయింది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 1.51 డాలర్ల లేదా 2.1 శాతం పడిపోయి బ్యారెల్ 69.35 డాలర్లకి పడిపోయాయి.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

ఇక్కడ తనిఖీ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios