దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉంటున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. నిజానికి మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయించేది క్రూడ్ ఆయిల్ ధరలు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల ఆధారంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తుంటారు.
గత కొంత కాలంగా దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు అలాగే ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో పెట్రోల్ ధరలు రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82 లీటరు. చొప్పున విక్రయిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో, నవంబర్ 13, 2022న కూడా, ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 వద్ద , లీటర్ డీజిల్ ధర రూ. 89.62 వద్ద స్థిరంగా ఉంది. ముంబైలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) వెబ్‌సైట్ iocl తాజా అప్‌డేట్ ప్రకారం, లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 , డీజిల్ ధర రూ.94.27గా ఉంది.
దేశంలోనే అత్యంత చవకగా పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు. లీటరు పెట్రోలు ధర రూ.84.10 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72కు విక్రయిస్తుండగా, డీజిల్ రూ.89.62కు మాత్రమే లభిస్తున్నట్లు ఐఓసీఎల్ వెబ్ సైట్ వెల్లడించింది.
భారతదేశం ప్రధానంగా ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీని వల్లనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు అస్థిరంగా ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పన్నులు, వాట్ పన్ను, రూపాయి క్షీణత , రిఫైనరీ కమిషన్ వంటి ఇతర అంశాలు కూడా పెట్రోల్ డీజిల్ ధరలపై ప్రభావం చూపుతాయి.
పైన పేర్కొన్న పెట్రోల్ డీజిల్ ధరలు రేపటి ఉదయం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), వంటి పెట్రోలియం కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజూ నిర్ణయిస్తాయి
ఇదిలా ఉంటే అంతర్జాతీయ ఆర్థిక మందగమనం భయాల మధ్య ఇంధన డిమాండ్‌లో గణనీయమైన తగ్గుదల , సెంట్రల్ బ్యాంకులు క్రమంగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు, డాలర్ బాండ్ల రాబడి పెరుగుతున్న కారణంగా, అంతర్జాతీయంగా డాలర్ బలపడుతోంది.
