న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు  ముగిసినందున మరోసారి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం  ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2 శాతం క్రూడాయిల్  ధరలు  తగ్గినా కూడ పెట్రోల్, డీజీల్  ధరలు  మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ‌ ఫలితాల తర్వాత  గురువారం నాడు  పెట్రోల్ ధరలు 11 పైసలు పెరిగాయి.  గత రెండు నెలల్లో  30 శాతం క్రూడాయిల్ ధరలు  తగ్గాయి.  కానీ దేశంలో  పెట్రోలియం  ఉత్పత్తుల ధరలు  విపరీతంగా పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర 9 పైసలు పెరిగింది. దీంతో  ఢిల్లీలో లీటర్ పెట్రోల్  ధర రూ.70.29కు చేరుకొంది. డీజీల్ ధర కూడ లీటర్‌ 64.66 వద్ద స్థిరంగా  కొనసాగుతోంది. 
ముంబైలో పెట్రోలు ధర 11 పైసలు పెరిగి రూ.75.91 ఉండగా..డీజిల్ ధర రూ.67.66 గా ఉంది.

కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 72.38 , డీజిలు ధర రూ. 66.40కు చేరింది.హైదరాబాద్లో పెట్రోలు ధర  రూ.74.55. డీజిల్ ధర రూ70.26 గా ఉంది.అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన రికార్డు స్థాయిలో పెరిగాయి.  పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు కేంద్రం జోక్యం చేసుకొంది.