Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ రూ.90

ముంబయిలో ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.97 పైసలు ఉండగా సోమవారం ఉదయానికి 11 పైసలు పెరిగి రూ.90.08కి చేరింది. 

Petrol price crosses Rs 90 mark in Mumbai, costs Rs 91.96/litre in Patna today
Author
Hyderabad, First Published Sep 24, 2018, 11:30 AM IST

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ముంబయిలో పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది. ముంబయిలో ఆదివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.97 పైసలు ఉండగా సోమవారం ఉదయానికి 11 పైసలు పెరిగి రూ.90.08కి చేరింది. ఇక డీజిల్‌ ధర ఇక్కడ రూ.78.58గా ఉంది. ఇక దేశంలోనే అత్యధికంగా పట్నాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.96గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.79.68గా నమోదైంది.

దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.82.72 పైసలు ఉండగా.. డీజిల్‌ ధర రూ.74.02గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.84.54గా ఉండగా డీజిల్‌ ధర రూ.75.97గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 87.70గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.51కి చేరింది. గత ఐదు నెలల్లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.4.66 పెరగగా.. డీజిల్‌ ధర రూ.రూ.6.35 పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios