Asianet News TeluguAsianet News Telugu

మళ్ళీ పెరుగుతున్న క్రూడాయిల్.. నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు ఇంధన ధరలు ఇవే..

ఒక నివేదిక ప్రకారం, బ్రెంట్ క్రూడ్ 0122 GMT నాటికి 73 సెంట్లు లేదా 0.9% పెరిగి బ్యారెల్‌కు $84.65 వద్ద ఉంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కి $80.41 వద్ద అంటే 85 సెంట్లు లేదా 1.1% పెరిగింది.
 

Petrol Diesel Rate Today on 27 December: Fuel rates unchanged Check rates in  your cities
Author
First Published Dec 27, 2022, 9:34 AM IST

నేడు ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు అంటే  27 డిసెంబర్ 2022న స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో చివరిసారిగా మార్పు జరిగి దాదాపు ఏడు నెలలు గడిచాయి. ఈ ఏడాది మే 21న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

ప్రతిరోజూ ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏవైనా సవరణలు ఉంటే అమల్లోకి వస్తాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ ఓ‌ఎం‌సిలు జారీ చేసిన రోజువారీ ధరల సవరణలు విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఉంటాయి. ఇంధన ధరలో రాష్ట్రాల వారీగా మార్పు విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు మొదలైనవి కారణమని చెప్పవచ్చు.

ఒక నివేదిక ప్రకారం, బ్రెంట్ క్రూడ్ 0122 GMT నాటికి 73 సెంట్లు లేదా 0.9% పెరిగి బ్యారెల్‌కు $84.65 వద్ద ఉంది, అయితే US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కి $80.41 వద్ద అంటే 85 సెంట్లు లేదా 1.1% పెరిగింది.

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63,  డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతా:  ఈ రోజు పెట్రోల్  ధర లీటర్‌కు రూ. 106.03, డీజిల్ ధర లీటర్‌కు రూ. 92.76,
బెంగళూరు:  పెట్రోలు ధర లీటర్‌కు రూ. 101.94, డీజిల్ ధర రూ.89 లీటరుకు
లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర లీటరుకు రూ. 90.05
చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర లీటరుకు రూ. 84.26
ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరల పై వ్యాట్‌ను కూడా తగ్గించాయి. జులైలో మహారాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటరుకు రూ.3, పెట్రోల్‌పై రూ.5 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించింది. ఇంధన ధరలను సవరించిన చివరి రాష్ట్రం మేఘాలయ, ఆగస్టు 24న వ్యాట్‌ని పెంచింది. ఫలితంగా, షిల్లాంగ్ లో ఇప్పుడు లీటర్ పెట్రోల్‌ ధర రూ.96.83, లీటర్ డీజిల్‌ ధర  రూ.84.72గా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios