Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా.. బంకుకి వెళ్లేముందు కొత్త ధరలు తెలుసుకోండి..

గత ఏడాది మే 21న  ఇంధన ధరలలో చివరిసారిగా దేశవ్యాప్త మార్పు జరిగింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించిన  సంగతి మీకు తెలిసిందే. 

Petrol Diesel Rate Today 2 May: Fuel prices largely steady Check rates  of your cities here-sak
Author
First Published May 2, 2023, 9:55 AM IST

నేడు మే 2 మంగళవారం రోజున పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పదకొండు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలలో  ఎలాంటి మార్పు లేదు. అయినప్పటికీ కొన్ని రాష్ట్ర నగరాల ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అలాగే ఇంధన  ధరలు ప్రతి రాష్ట్రానికి నుండి రాష్ట్రంకి మారుతుంటాయి.  వీటి ధరలు వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. 

గత ఏడాది మే 21న  ఇంధన ధరలలో చివరిసారిగా దేశవ్యాప్త మార్పు జరిగింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించిన  సంగతి మీకు తెలిసిందే. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి. 

పంజాబ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 90 పైసల సెస్‌ విధించాలని అక్కడి పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించగా,  కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ రెండవ పూర్తి బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ఇంకా మద్యంపై సెస్‌ను ప్రకటించారు.  

  బ్రెంట్ క్రూడ్  0021 GMT నాటికి బ్యారెల్‌కు 2 సెంట్లు తగ్గి $79.29కి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 2 సెంట్లు తగ్గి $75.64కి చేరుకుంది.  

మెట్రో నగరాల్లో  నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27

బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర  రూ. 87.89

చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.73, డీజిల్ ధర రూ. 94.33

గురుగ్రామ్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.85, డీజిల్ ధర రూ. 89.73

కోల్‌కతా: పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

లక్నో: పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజు ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటె ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios