Asianet News TeluguAsianet News Telugu

క్రూడయిల్ ధరల పతనం..పెట్రోల్ 41 పైసలు, డీజిల్ 40 పైసల్ పెంపు.. నేటి కొత్త ధరలు ఇవే..

క్రూడాయిల్  గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో ధరలలో మార్పు నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ధర $83.19 డాలర్లకు చేరుకుంది.   WTI కూడా బ్యారెల్‌కు $ 76.48డాలర్లకు చేరింది.

Petrol Diesel Prices update: fuel became cheaper in NCR due to softening of crude prices check todays latest rate
Author
First Published Nov 29, 2022, 9:28 AM IST

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల పతనం కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చమురు వినియోగం తగ్గడం వల్ల ఒపెక్ మరోసారి ధరలను తగ్గించింది, దీంతో మంగళవారం ఉదయం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను కూడా ప్రభావితం చేసింది. ఎన్‌సి‌ఆర్ సహా కొన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గగా ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో నేటికీ పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వ చమురు కంపెనీలు మార్చలేదు.

ప్రభుత్వ ఆయిల్ సంస్థల ప్రకారం, ఈ ఉదయం గౌతమ్ బుద్ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) పెట్రోల్ లీటరుకు 41 పైసలు తగ్గి రూ. 96.53, డీజిల్ లీటరుకు 40 పైసలు తగ్గి రూ. 89.71కి చేరింది. ఘజియాబాద్‌లో పెట్రోలు ధర 18 పైసలు పెరిగి రూ.96.58కి చేరగా, డీజిల్ 17 పైసలు పెరిగి రూ.89.75కి చేరుకుంది. గురుగ్రామ్‌లో కూడా నేడు పెట్రోలు ధర 6 పైసలు పెరిగి లీటరు రూ. 97.10కి, డీజిల్ ధర 5 పైసలు పెరిగి రూ. 89.96కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో లీటర్ పెట్రోల్ 56 పైసలు పెరిగి రూ.107.80కి చేరగా, డీజిల్ 52 పైసలు పెరిగి రూ.94.56కి చేరుకుంది.

క్రూడాయిల్  గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో ధరలలో మార్పు నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ ధర $83.19 డాలర్లకు చేరుకుంది.   WTI కూడా బ్యారెల్‌కు $ 76.48డాలర్లకు చేరింది.

నాలుగు మెట్రోలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ 96.65, డీజిల్ ధర రూ 89.82 
- ముంబైలో  పెట్రోల్ ధర రూ 106.31, డీజిల్ ధర రూ 94.27
-చెన్నైలో పెట్రోల్ ధర రూ 102.63, డీజిల్ ధర రూ 94.24
-కోల్‌కతాలో  పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76

హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.


ఈ నగరాల్లో కొత్త ధరలు మారాయి
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.53, డీజిల్ ధర లీటరుకు రూ. 89.71.
– గురుగ్రామ్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.10, డీజిల్‌ ధర రూ.89.96గా ఉంది.
– పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.80, డీజిల్ ధర రూ.94.56కి చేరింది.
– ఘజియాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.58, డీజిల్‌ ధర రూ.89.75గా ఉంది.
 
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

మీరు SMS ద్వారా కూడా ధరలను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSPని టైప్ చేసి సిటీ కోడ్‌ను 9224992249కి SMS పంపడం ద్వారా,  BPCL కస్టమర్‌లు RSPని టైప్ చేసి వారి సిటీ కోడ్‌ను 9223112222కి ఎస్‌ఎం‌ఎస్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL కస్టమర్‌లు HPPrice వారి సిటీ కోడ్‌ను 9222201122కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios