Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి తరువాత ఇంధన ధరలు పెరిగాయా లేదా తగ్గాయా ? మీ నగరంలో నేడు లీటరు కొత్త ధర ఎంతో తెలుసుకోండి..

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం గత  త్రైమాసికంలో పెట్రోల్, డీజిల్ ధరల స్తంభన కారణంగా భారీ నష్టాలను చవిచూశాయి. గత ఏడాది మేలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్  లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.
 

Petrol Diesel Prices update: Did fuel prices rise or fall today? know new fuel rates  of your city-sak
Author
First Published Jan 17, 2023, 9:17 AM IST

న్యూఢిల్లీ : దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో మాంద్యం భయాలు హెడ్ లైన్స్ కావడంతో మంగళవారం ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇండియాలో మాత్రం ఇంధన ధరలపై ఎలాంటి ప్రభావం లేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరల సవరణను ప్రకటిస్తాయి, అయితే జనవరి 17, మంగళవారం రోజున పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం గత  త్రైమాసికంలో పెట్రోల్, డీజిల్ ధరల స్తంభన కారణంగా భారీ నష్టాలను చవిచూశాయి. గత ఏడాది మేలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్  లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

పెట్రోల్, డీజిల్ తాజా ధరలు
తాజా ఇంధన ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.106.31ఉండగా, లీటర్ డీజిల్‌ ధర రూ.94.27గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ.100 మార్కుకు మించింది. ఇక్కడ లీటర్ పెట్రోల్‌ ధర రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89గా ఉంది.

 హిమాచల్ ప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న డీజిల్‌పై వ్యాట్‌ని లీటరుకు రూ.3 పెంచింది. దీంతో డీజిల్‌పై వ్యాట్‌  లీటర్‌కు రూ.4.40 నుంచి రూ.7.40కి చేరింది.

ఇతర నగరాలలో ఇంధన ధరలు 

నోయిడా
పెట్రోలు - లీటరుకు రూ.96.79
డీజిల్ - లీటరుకు రూ.89.96

గుర్గావ్
పెట్రోలు - లీటరుకు రూ.97.18
డీజిల్ - లీటరుకు రూ.90.05

చండీగఢ్
పెట్రోలు - లీటరుకు రూ.96.20
డీజిల్ - లీటరుకు రూ.84.26

చెన్నై
పెట్రోలు - లీటరుకు రూ.102.63
డీజిల్ - లీటరుకు రూ.94.24

కోల్‌కతా
పెట్రోలు - లీటరుకు రూ.106.03
డీజిల్ - లీటరుకు రూ. 92.76

లక్నో
పెట్రోలు - లీటరుకు రూ.96.62
డీజిల్ - లీటరుకు రూ.89.81

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంటాయి. ఇంకా విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL)  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios