Asianet News TeluguAsianet News Telugu

Petrol Diesel Prices Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..?

భారతీయ చమురు కంపెనీలు మే 21 నుండి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 23 ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంది.  
 

Petrol Diesel Prices Today
Author
Hyderabad, First Published Jun 23, 2022, 9:37 AM IST

దేశవ్యాప్తంగా గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇంధన రేట్లలో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు. మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మే 21న పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా లీటర్‌ పెట్రోల్‌ 9.50 రూపాయలు, డీజిల్‌పై 7 రూపాయలు తగ్గింది. 

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి గురువారం (జూన్ 23, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా గురువారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది. 

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.72 కాగా, డీజిల్‌ రూ. 89.62 వద్ద కొనసాగుతోంది.
 
- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.35 కాగా, డీజిల్‌ రూ. 97.28గా ఉంది.
 
- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.63 కాగా, డీజిల్ రూ. 94.24గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.94 కాగా, డీజిల్‌ రూ. 87.89 వద్ద కొనసాగుతోంది. 

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.03 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 92.76గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.66 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 97.82గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.111.69కాగా, డీజిల్‌ రూ. 99.42గా ఉంది.

భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్  పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios