నేడు అంటే జనవరి 3న సోమవారం చమురు కంపెనీలు(oil companies) పెట్రోల్, డీజిల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే గత కొంతకాలంగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్-డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.  దీపావళి సందర్భంగా పెట్రోల్(petrol), డీజిల్‌(diesel)పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తు ప్రకటించిన సంగతీ మీకు తెలిసిందే ఆ తర్వాత ఇంధన ధరలు(fuel prices) కాస్త దిగోచ్చాయి.

ప్రభుత్వ చమురు కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. నవంబర్ 3 తర్వాత నుండి చమురు ధరలు నిలకడగా కొనసాగడం ఇదే తొలిసారి. అయితే బీహార్, రాజస్థాన్‌తో సహా అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికీ రూ.100కు పైగానే ఉంది. గత ఏడాది దీపావళి సందర్భంగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది దీంతో చమురు ధరలు కాస్త దిగోచ్చాయి.

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా డిసెంబర్ 1న పెట్రోల్ పై వ్యాట్ ను 30 నుండి 19.4 శాతానికి తగ్గించింది. ఓ‌ఎం‌సిల ధరల నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీ మినహా అని మెట్రో నగరాలలో పెట్రోల్ ధర ఇప్పటికీ రూ.100పైగానే ఉంది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ.109.98గా ఉంది. 

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర రూ.86.67గా ఉంది.

ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.109.98, డీజిల్ ధర రూ.94.14.

also read కొత్త ఏడాదిలో స్టాక్ మార్కెట్ శుభారంభం.. లాభాల్లో మొదలైన సెన్సెక్స్, నిఫ్టీ..

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా, లీటర్ డీజిల్ ధర రూ.91.43గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర రూ.101.56.

భోపాల్‌లో పెట్రోల్ ధర రూ.107.23, డీజిల్ ధర లీటరుకు రూ.90.87.

హైదరాబాద్ పెట్రోల్ ధర - రూ.108.20, డీజిల్ ధర - రూ.94.62

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గత సంవత్సరం దాదాపు 50 శాతం పెరిగాయి, మార్కెట్ సానుకూలతతో 2022 ప్రారంభంలో సోమవారం కూడా ట్రెండింగ్‌లో కొనసాగింది. వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ వేరియంట్ ఓమికార్న్ కారణంగా డిమాండ్‌పై ఆందోళనలు తగ్గినప్పటికీ, పరిమిత లాభాలు వచ్చాయని ఒక నివేదిక నివేదించింది. బ్రెంట్ క్రూడ్ 0102 GMT నాటికి బ్యారెల్‌కు 67 సెంట్లు లేదా 0.86 శాతం పెరిగి 78.45డాలర్లకి చేరుకుంది. యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 77 సెంట్లు లేదా 1.02 శాతం పెరిగి 75.98డాలర్లకి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించిన తర్వాత ప్రతి రోజు కొత్త ధరలను నిర్ణయిస్తాయి. ఇంధన ధరల సవరణ ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి.