Asianet News TeluguAsianet News Telugu

petrol diesel prices:పెట్రోల్, డీజిల్ లేటెస్ట్ రేట్స్ విడుదల.. నేడు లీటరుకు ఎంతంటే ?

గత కొద్ది రోజులుగా  జాతీయ స్థాయిలో ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. కాగా నెలకు పైగా ఇంధన ధరలు మారకుండా ఉండడం ఇదే తొలిసారి. గత నెల నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని  తగ్గించింది. 
 

Petrol diesel prices today: Rates constant on 09 December check here what you need to pay in your city
Author
Hyderabad, First Published Dec 9, 2021, 11:39 AM IST

ప్రభుత్వ చమురు కంపెనీలు నేడు పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలకు కానుకగా ఇచ్చింది.  ప్రభుత్వం పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై పది రూపాయలు తగ్గించింది. ఆ తర్వాత చమురు ధరల్లో భారీగా తగ్గుదల నమోదైంది.

అలాగే గత వారం కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీలో పెట్రోల్ ధరను రూ. 8.56 తగ్గించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 పైగానే ఉంది. మరోవైపు  ఇంధన ధరలు ఇప్పటికీ సామాన్యుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.  

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ధర, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది.హైదరాబాద్ : పెట్రోలు ధర – లీటర్‌కు రూ. 108.20, డీజిల్ ధర – లీటర్‌కు రూ. 94.62,

క్రూడ్ ఆయిల్ ధరలు
ప్రపంచ ఆర్థిక వృద్ధిని అడ్డుకుంటున్న ఓమిక్రాన్ వేరియంట్ గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, చమురు ధరలు సానుకూల ధోరణిని కొనసాగిస్తూ బుధవారం ముగిశాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 38 సెంట్లు లేదా 0.5% పెరిగి  75.82 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 31 సెంట్లు లేదా 0.4% పెరిగి బ్యారెల్  72.36 డాలర్ల వద్ద ముగిసింది.

మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలను మీరు ఎస్‌ఎం‌ఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. IndianOil వెబ్‌సైట్ ప్రకారం మీరు RSP అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249కి పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.

ఇక్కడ తనిఖీ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సావరిస్తాయి. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ అలాగే ఇతర జోడించిన తర్వాత, దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.ఈ పారామితుల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ రేటును నిర్ణయింస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios